Jana Sena-TDP: టీడీపీ జనసేన పొత్తు ఖరారు.. పవన్ నిర్ణయంతో ఏపీ పొలిటికల్ లెక్కలు మారనున్నాయా?

Jana Sena-TDP:  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తు కరారు చేసేసారు. ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో ఏపీ రాష్ట్ర రాజకీయ లెక్కలు మారబోతున్నాయని వార్ వన్ సైడ్ అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ పరామర్శించారు.

మొదటి నుంచి కూడా ఈ రెండు పార్టీలకు కుదుర్చుకొని ఎన్నికల బరిలో దిగబోతున్నాయి అంటూ వార్తలు వచ్చినప్పటికీ ఎక్కడ కూడా స్పష్టమైన ప్రకటన తెలియజేయలేదు అయితే చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో నేడు రాజమండ్రి జైలులో లోకేష్ , పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ముగ్గురు ఒకేసారి ఆయనతో భేటీ అయ్యారు దాదాపు 45 నిమిషాల భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుకి తాను సంఘీభావం తెలపడం కోసమే ఇక్కడికి వచ్చానని తెలియజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో అరాచకపు పాలన కొనసాగుతుందని అందులో భాగంగానే చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారని ఈయన తెలిపారు. నేను తీసుకుని కొన్ని నిర్ణయాలు కొందరికి బాధ కలిగిస్తాయి 2014 సంవత్సరంలో దేశానికి సమర్థవంతమైన నాయకుడు ఉండాలన్న ఉద్దేశంతోనే మోడీతో పొత్తు కుదురుచుకున్నాము అలాగే 2019 ఎన్నికల సమయంలో పాలసీ విధానంతోనే చంద్రబాబును విభేదించానని తెలిపారు.

తాను ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరిగి చూడనని ఇక నేడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా ఒక రాజకీయ కక్ష అని, దీన్ని సంపూర్ణంగా ఖండిస్తున్నాం. ఇవాళ్టి భేటీ చాలా కీలకమైంది. ఈ భేటీ తో రాబోయే ఎన్నికల్లో పొత్తు గురించి ఓ నిర్ణయానికి వచ్చాము వచ్చే ఎన్నికలలో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తాయి అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇలా ఈ రెండు పార్టీలు కలిసి బరిలోకి దిగితే తప్పకుండా అధికారం అందుకోవడం ఖాయమేనని పలువురు ఈ విషయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -