Janasena: ఏపీలోని 21 అసెంబ్లీ స్థానాలలో జనసేన పరిస్థితి ఇదీ.. అన్ని స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందా?

Janasena: మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జనసేన పోటీ చేస్తున్నటువంటి ఈ స్థానాల విషయంలో ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ పరిస్థితులను గమనిస్తూనే ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా సర్వేలను చేయిస్తూ ఎప్పటికప్పుడు ప్రచార కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.

ఇక జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి ఇరవై ఒక్క స్థానాలలో కూడా భారీ స్థాయిలో సర్వేలను చేయించడమే కాకుండా ప్రచార కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తూ వచ్చారు అయితే ఎన్నికలలో భాగంగా జనసేన పోటీ చేయబోయే 21 స్థానాలలో జనసేనకి ఏ విధమైనటువంటి ఆదరణ లభిస్తుంది అనే విషయానికి వస్తే.. ప్రస్తుతం జనసేన పోటీ చేయబోయే 21 స్థానాలలో 11 స్థానాలు పక్క జనసేన గెలుపు అందుతుందని పలు సర్వేలు చెబుతున్నాయి.

పిఠాపురంతోపాటు, అనకాపల్లి, పెందుర్తి, కాకినాడ రూరల్, పి. గన్నవరం, రాజోలు, నర్సాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం, తెనాలి, అవనిగడ్డ నియోజకవర్గాలున్నాయి. కాగా, నెల్లిమర్ల నియోజకవర్గం అలాగే వైజాగ్ సౌత్, యలమంచిలి, నిడదవోలు, రాజానగరం నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి గట్టి పోటీ వున్నా, జనసేనకే ఎడ్జ్ కనిపిస్తోంది. తిరుపతి, పోలవరం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో జనసేన స్ట్రాంగ్‌గానే వున్నా, ఎడ్జ్ మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉంది.

మిగిలిన ప్రాంతాలలో జనసేన కాస్త బలహీనంగా ఉందని చెప్పాలి. ఇంకా ఎంపీ సీట్లకు పోటీ చేయబోయే రెండు ప్రాంతాలలో కూడా జనసేన పక్కగా గెలుస్తుందని ఇటీవల ఓ సర్వేలో తెలియజేయడమేంది. ఇలా ఏ ఏ ప్రాంతాలలో జనసేన కాస్త బలహీనంగా ఉందనే విషయాలను గుమనిస్తూ ఆ ప్రాంతాలలో పెద్ద ఎత్తున పర్యటనలు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. మొత్తానికి ఎన్నికలలో జనసేన పోటీ చేయబోతున్నటువంటి 21 స్థానాలు కూడా తమ పార్టీని గెలిపించుకొనే దిశగానే కార్యకర్తలు అభ్యర్థులు అడుగులు వేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -