Janasena: 2024లో జనసేనదే అధికారం.. పవన్ మాటలకు టీడీపీ, వైసీపీ మైండ్ బ్లాంక్ అయినట్టేనా?

Janasena: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో శ్రీకాకుళంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మరొకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి మూడవ విడతలో భాగంగా విశాఖలో యాత్రను కొనసాగిస్తున్నారు. విశాఖలో స్టార్ట్ అవ్వగా ఎయిర్ పోర్టు నుంచే జనసేన క్యాడర్ సీఎం పవన్ అంటూ నినాదాలు చేశారు. అందుకు తగినట్లుగా జగదాంబ జంక్షలో పవన్ స్పీచ్ కూడా సాగింది. జనసేన అధికారంలోకి వస్తే అంటూ ఆయన మాట్లాడారు. విలవిలలాడుతున్న విశాఖను కాపాడుతమంటూ ఒట్టేశారు.

ఏయూని ప్రక్షాణల చేస్తామని మాట ఇచ్చారు. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను సరి చేస్తామని అన్నారు పవన్. అలా విశాఖలో తాజాగా పవన్ కళ్యాణ్ ప్రసంగం మొత్తం కూడా ఆవేశపూరితంగా సాగిందని చెప్పవచ్చు. విశాఖలో జనసేన ఏ విధంగా మాట్లాడతారా అసలు ఏం మాట్లాడతారు అని వైసీపీ నేతలు కూడా కాస్త భయంగానే ఎదురు చూశారని చెప్పవచ్చు. ఇక వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో జనసేన ప్రభుత్వం రాబోతోంది అంటూ ధీమాను వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. వైసీపీలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారంతా రెడీగా ఉండాలని పవన్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏపీలో వైసీపీని ఓడిస్తామని పవన్ అన్నారు.

తామే అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు కూటమి గురించి కాకుండా జనసేన మాత్రమే అధికారంలోకి వస్తుందని పవన్ చెప్పడం పైన తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. చంద్రబాబు సీఎం అవుతారని తమ్ముళ్ళు అంటున్నారు. జనసేన మాత్రమే ఏపీని గాడిలో పెట్టగల పార్టీ అని పవన్ అంటున్నారు. విశాఖలో పవన్ స్పీచ్ చూస్తే సీఎం పదవికి అధికారానికి తామే ప్రధాన పోటీ అని చెప్పకనే చెప్పారని అంటున్నారు. పొత్తులు ఉండొవచ్చు, మిత్రుల మధ్య స్నేహాలు కూడా ఉండవచ్చు,కానీ తమ అజెండాతోనే ముందుకు వెళ్తామని అధికారంలోకి వస్తామని పవన్ మాటలను బట్టి అర్ధం అవుతోంది. మొత్తానికి తాజాగా విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు వైసీపీకి అలాగే టీడీపీకి దిమ్మతిరిగినట్టుగా అయింది

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -