Janasena: జనసేన స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా.. గ్రౌండ్ లెవెల్ లో అసలు ఏం జరుగుతోందంటే?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంది. 175 నియోజకవర్గాలలో వైసిపి ప్రభుత్వం సింగిల్ గా పోటీ చేస్తూ ఉండగా తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నారు. అయితే 175 నియోజకవర్గాలలో జనసేన కేవలం 21 స్థానాలలో మాత్రమే పోటీ చేస్తుంది.

ఇలా 21 స్థానాలలో జనసేన పార్టీ పోటీ చేస్తూ ఉండగా జనసేన పార్టీని గెలిపించాలని ఒకవైపు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలకి కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. ఇక ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ లో కనుక ప్రజాభిప్రాయం సేకరిస్తూ ఉండగా పవన్ కళ్యాణ్ గెలుపు ఈసారి అన్ని చోట్ల ఖాయమేనని స్పష్టంగా అర్థమవుతుంది.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురంలో ఈయన ఏకంగా రెండు లక్షల మెజార్టీతో గెలుస్తారని ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైంది. ఈ విధంగా వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు కూడా ఎప్పటికప్పుడు జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్ పరిస్థితులను తెప్పించి అంచనాలు వేస్తున్నారు.

జనసేనాని గతంలో ప్రకటించిన 98 శాతం స్ట్రైక్ రేట్ కాస్తా, ఇప్పుడు 100 శాతం స్ట్రైక్ రేట్ వరకు చేరుకునేలా పరిస్థితులు మారాయి. ఒక్కటంటే ఒక్క ఓటు కూడా, టీడీపీ – జనసేన – బీజేపీ దాటి బయటకు వెళ్లకూడదు అన్న ఉద్దేశంతో మూడు పార్టీలు కలిసి పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తూ ముందడుగు వేస్తున్నారు. ఇలా గ్రౌండ్ లెవెల్ లో జనసేన పరిస్థితి చూస్తుంటే మాత్రం ఈసారి తప్పకుండా పవన్ కళ్యాణ్ తన అభ్యర్థులతో కలిసి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -