Jr NTR-Ram Charan: మా హీరోనే గొప్ప అంటూ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవ.. వీళ్లు మారరా అంటూ?

Jr NTR-Ram Charan: ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి అనే సామెత మనం వింటూనే ఉంటాం. దీని అర్థం ఏమిటంటే అసలు పని చేసే వాళ్ళు శ్రద్ధగా వారి పని వారు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. కానీ ఏమాత్రం సంబంధం లేని వారు మాత్రం ఆ పనేదో వాళ్లే చేసేస్తున్నట్లు తెగ హడావిడి పడి, పక్క వాళ్ళని కూడా హడావిడి పెడుతూ ఉంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని, రామ్ చరణ్ ఫ్యాన్స్ ని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. సినిమాలు చేసుకుంటూ ఇద్దరూ హీరోలు ఎంతో ఫ్రెండ్లీ గా ఉంటూ వాళ్ళ పని వాళ్లు చేసుకుంటున్నారు.

కానీ వాళ్ల ఫ్యాన్స్ మాత్రం మాటలు యుద్ధం చేసుకుంటూ నానా హైరానా పడిపోతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే సైమా అవార్డుల విషయంలో మా హీరోకి అవార్డు వచ్చిందని పండగ చేసుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. అలా అయితే పర్వాలేదు మీ హీరోకి రాలేదు అంటూ ఎద్దేవా చేస్తున్నారు కొందరు అభిమానులు. అక్కడే రామ్ చరణ్ ఫ్యాన్స్ కి చిర్రెత్తుకొస్తుంది.

మా హీరో ఫంక్షన్ లో అటెండ్ అవ్వలేదు కాబట్టి అవార్డు ఇవ్వలేదు. అటెండ్ అయ్యి ఉంటే మా హీరోకి కూడా అవార్డు వచ్చేది అంటూ తమ హీరోని వెనకేసుకొస్తున్నారు రామ్ చరణ్ ఫాన్స్. అలా అయితే రాజమౌళి, యష్ వంటి వారు కూడా ఫంక్షన్ కి అటెండ్ అవ్వలేదు. అయినా వాళ్ళకి అవార్డులు ఇచ్చారు అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. నేషనల్ అవార్డ్స్ ఇచ్చే సమయంలో కూడా ఇలాంటి రచ్చే జరిగింది.

ఎన్టీఆర్ కి నేషనల్ అవార్డు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఎన్టీఆర్ అభిమానులు. అయితే అక్కడ అవార్డు అల్లు అర్జున్ కి రావడంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కామ్ గా ఊరుకున్నారు. లేదంటే అక్కడ కూడా మళ్లీ రచ్చ మొదలయ్యేది. ఇలాంటి గొడవలు చూసి వాళ్లు వాళ్లు బానే ఉన్నారు మధ్యలో వీళ్ళు ఎందుకు కొట్టుకు చూస్తున్నారు. ఇంక వీళ్ళు మారరు అంటూ విసుక్కుంటున్నారు మిగిలినవారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -