Jr NTR: తన సినిమా రిలీజ్ అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంత టెన్షన్ పడతారా!

Jr NTR:  టాలీవుడ్ ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్. ఆపై పలు సినిమాల్లో నటించి నటుడుగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక నటన విషయంలో పూర్తిగా తాతకు తగ్గ మనవడుగా పేరు సంపాదించుకున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే.

అలా ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక ఇటీవల దర్శకదీరుడు రాజమౌళి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ సినిమాలో ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో బి టౌన్ ప్రేక్షకులను సైతం కదిలించాడు.

అన్ని ఎమోషన్స్ ని ఒకే పాత్రలో పండించాడు ఎన్టీఆర్. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో హడావిడి చేస్తున్నాడు. అంతేకాకుండా వరల్డ్ వైడ్ గా కూడా పలు సినిమా ఆఫర్లు అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా హడావిడి చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ తన ప్రతి సినిమా విడుదల సమయంలో చాలా టెన్షన్ పడతాడని వార్తలు వినిపిస్తున్నాయి.

విడుదలైన రోజు సినిమా టాక్ తెలిసే వరకు ఎన్టీఆర్ మనశ్శాంతిగా ఉండడట. సినిమాకు హిట్ టాక్ వస్తే తన ఆనందాన్ని మనసులోనే దాచుకొని ఏమాత్రం గర్వించకుండా తన లోపలే హ్యాపీగా ఫీల్ అయ్యే ఎన్టీఆర్.. తన సినిమా ఫ్లాప్ అని తెలిస్తే మాత్రం ఏమాత్రం జీర్ణించుకోలేడట. చాలా బాగా ఫీల్ అవుతాడని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందులో డైరెక్టర్ కొరటాల శివతో ఒక ప్రాజెక్టు చేస్తున్నాడు. మరొకటి కే జి ఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక ప్రాజెక్టు చేస్తున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -