Jr NTR: జపాన్ లో ఏ మాత్రం తగ్గని ఎన్టీఆర్ క్రేజ్.. వైరల్ అవుతున్న వీడియో?

Jr NTR: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలకు విపరీతమైన అభిమానులు ఉంటారు.అయితే ఏ భాషలో ఉండే హీరోలకు ఆ భాషలో విపరీతమైన ఆదరాభిమానాలు ఉంటాయని చెప్పవచ్చు .అయితే ఒక ఇండస్ట్రీలో పని చేసే హీరో పాన్ ఇండియా స్థాయిలో ఆదరాభిమానాలు సంపాదించుకోవాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. అయితే పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా విదేశాలలో కూడా ఒక హీరోకి అభిమానులు ఉన్నారంటే వారికి ఎలాంటి క్రేజ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా విదేశాలలో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఈ హీరో విపరీతమైన ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నారు.ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి విజయం అందుకుంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమాని జపాన్ లో విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేశారు.అక్టోబర్ 21వ తేదీ ఈ సినిమా జపాన్ లో విడుదల కానున్న నేపథ్యంలో రాజమౌళితో పాటు ఈ సినిమాలో హీరోలుగా నటించిన రామ్ చరణ్ ఎన్టీఆర్ సైతం జపాన్ పర్యటనలో ఉన్నారు.జపాన్ పర్యటనలో ఉన్నటువంటి ఈ హీరోలు ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.అయితే ఎన్టీఆర్ నివసిస్తున్నటువంటి హోటల్లో ఒక హౌస్ కీపింగ్ ఉమెన్ వచ్చి తాను ఎన్టీఆర్ కి అభిమానినని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ క్రమంలోనే ఆ మహిళ ఎన్టీఆర్ ను కలిసి ఎన్టీఆర్ కి వీరాభిమాని అని చెప్పడమే కాకుండా ఎన్టీఆర్ గురించి ఒక అద్భుతమైన లెటర్ కూడా రాసి ఇవ్వడంతో ఎన్టీఆర్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇది రాసింది మీరేనా అంటూ తారక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా ఎన్టీఆర్ కి జపాన్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఉందని ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -