Devara: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దేవర ఏఐ ఫోటోలు.. ఈ ఫోటోలలో తారక్ లుక్ అదుర్స్ అంటూ?

Devara: దేవర సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లో తెరకెక్కుతోందని ఈ సినిమా యాక్షన్ సీన్స్ సైతం అద్భుతంగా ఉండడం ఉన్నాయని సమాచారం. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు రెండు భాగాలుగా సినిమాలు చేయటం అనేది కామన్ అయిపోయింది. అలాగే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రావడం అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇన్నాళ్లు పార్ట్-2 ఉంటుందా, ఉండదా అనే దానిపై క్లారిటీ లేని ప్రేక్షకులకి కొరటాల శివ ఇప్పుడు పార్ట్ 2 ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చారు.

అంటే కొరటాల శివకి కచ్చితంగా మరికొంత టైం కేటాయించవలసిన అవసరం ఉంది. అయితే దాని ప్రభావం తారక్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? ఇటు ప్రశాంత్ అటు వార్ టు సినిమాల డేట్స్ విషయంలో ఏమైనా ఇబ్బందులు వస్తాయా.. ఆ ఇబ్బందుల్ని ఎన్టీఆర్ ఎలా ఫేస్ చేయబోతున్నారు అంటూ తెగ సతమతమైపోతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

స్టోరీ డిమాండ్ మేరకే రెండో భాగం చేయబోతున్నట్లు ప్రకటించారు కొరటాల శివ. ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చింది కేవలం దేవర సినిమాకు మాత్రమే అది కూడా జనవరిలోపు పూర్తవుతుందని అంచనా వేశారు అభిమానులు. ఆ తర్వాత వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలతో తారక్ బిజీ అవుతారని అనుకున్నారు కానీ సడన్గా దేవర టు ప్రాజెక్ట్ కన్ఫామ్ కావడంతో మరొక ఆరు నెలలైనా ఎక్స్ట్రా డేట్స్ కొరటాల శివ కి ఇవ్వాల్సిందే.

అయితే ఈ ప్రభావం ఇటు వార్ 2 పై గాని, ప్రశాంత్ నీల్ సినిమాపై కానీ తప్పకుండా పడుతుంది అంటున్నారు సినీ క్రిటిక్స్. అయితే మొన్న ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చిన వార్ 2 దర్శకుడు అయన్ ముఖర్జీ ఎన్టీఆర్ ని కలిసారని, అన్ని కుదిరితే డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభిస్తారని టాలీవుడ్ వర్గం కోడై కూస్తోంది. అయితే ఇన్ని సినిమాలకి డేట్స్ ఇవ్వటంపై ఎన్టీఆర్ ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు అనేదానిపై అందరి దృష్టి పడింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -