Jr NTR: సినీ కెరియర్లో ఎందుకు చేశాను రా అని బాధపడిన సినిమా అదే?

Jr NTR: నందమూరి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి బాల నటుడిగా అడుగుపెట్టి అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ నిన్ను చూడాలని అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన కెరియర్ మాత్రం స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతోనే ప్రారంభమైందని చెప్పాలి.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈయనకు ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు వచ్చాయి.

ఇలా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వెను తిరిగి చూసుకోకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక తాజాగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలను కొరటాల శివ అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించారు.

ఇక ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు.ఇదిలా ఉండగా ప్రతి ఒక్కరి సినీ కెరియర్ లోనూ హిట్టుతో పాటు ఫ్లాప్ సినిమాలు కూడా రావడం సర్వసాధారణం. ఇలా ఎన్టీఆర్ కెరియర్ లో కూడా హిట్ సినిమాలతో పాటు ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయని చెప్పాలి. అయితే ఎన్టీఆర్ తన సినీ కెరియర్లో ఈ సినిమా ఎందుకు చేశాను రా అని ఇప్పటికీ ఒక సినిమా గురించి ఫీలవుతూ ఉంటారట.

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి డిజాస్టర్ టాక్ తెచ్చుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో చేసినందుకు ఎన్టీఆర్ ఇప్పటికీ అసలు ఆ సినిమా ఎందుకు చేశానో అని భావన తనలో కలుగుతుందని తెలిపారు.ఇక ఇదే విషయమే పూరి జగన్నాథ్ గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ అసలు ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా కాదు ఇది అంటూ స్వయంగా ఒప్పుకున్నారు. ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఎప్పటికీ రిగ్రేట్ గా ఫీలవుతూనే ఉంటారట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -