Jr NTR: ఆ కోరిక ఈ జన్మకి తీరదా? ఎన్టీఆర్ జీవితంలో అదే లోటు?

Jr NTR:  తెలుగు సినీ ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా రాణిస్తున్నాడు. ఇకపోతే తారక్ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారాడు జూనియర్ ఎన్టీఆర్. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇక ఎన్టీఆర్ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో తనకంటూ ఒక చెరగని ముద్రణ వేసుకున్నాడు.

అయితే ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూ, మరొకవైపు ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్న తారక్ కీ ఒక్క కోరిక మాత్రం తీరలేదట. స్టార్ డమ్,డబ్బు ఇలా అన్నీ ఉన్నా కూడా తారక్ ను మాత్రం ఒక లోటు వెంటాడుతోందట. అలా జీవితంలో ఆయనకు అనుకున్న ఆ ఒక్క కోరిక తీయలేదట. ఇప్పటికీ ఆ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తి గానే ఉన్నాడట. ఎన్టీఆర్ లక్ష్మీప్రతిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు అభయ్ రామ్ భార్గవ్ రామ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ భార్య లక్ష్మీపతి రెండవసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు, తప్పకుండా ఆడపిల్ల పుడుతుందని అందరూ భావించారట.

తారక్ కూడా ఆడపిల్లే పుడుతుంది అని అనుకున్నారట. అలా ఆడపిల్ల పుడితే నందమూరి వంశానికి ఆడపడచు వస్తుందని ఎన్టీఆర్ చాలా ఆశపడ్డారట. కానీ రెండవసారి అబ్బాయి పుట్టడంతో ఎన్టీఆర్ కాస్త నిరాశ చెందాడట. కొడుకు పుట్టినందుకు హ్యాపీగానే ఉన్నప్పటికీ కూతురు పుట్టలేదు అన్న నిరాశ ఎన్టీఆర్ ను ఇప్పటికీ వెంటాడుతోందట. మామూలుగానే ఆడవారికి గౌరవం ఇచ్చే ఎన్టీఆర్ తనకు ఒక కూతురు పుడితే బాగుంటుంది అని అనుకున్నారట. కాగా ఈ విషయంలో మాత్రం ఎన్టీఆర్ కోరిక తీరలేదట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -