Jr NTR: మా నాన్న అసమర్థుడంటూ జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

Jr NTR: టాలీవుడ్ ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అనంతరం ఎన్టీఆర్ టాలీవుడ్ స్టార్ హీరోగా ఒక రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే.

మొత్తానికి ఎన్టీఆర్ నటనలో తాతకు తగ్గ మనవడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా సినిమా అవకాశాలు అందుకుంటూ షూటింగ్ నేపథ్యంలో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే గతం లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

తన తండ్రి ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారని, అలా మాట్లాడేవారిని మొరటి వారు అంటారని.. ఆ విషయానికొస్తే నేను కూడా ఏదైనా ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుతాను. నిజంగా మా నాన్న చాలా సమర్ధుడు అని ఎన్టీఆర్ తెలిపాడు. అంతేకాకుండా మా బాల బాబాయ్ కూడా మా నాన్నగారి లానే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారని ఎన్టీఆర్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ 30 అనే ప్రాజెక్టు షూటింగ్ నేపథ్యంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ 31 అనే ప్రాజెక్టును డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ రెండు సినిమాలు తో ఎన్టీఆర్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి. ఇక ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎన్టీఆర్ తదుపరి సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఎన్టీఆర్ తదుపరిచిత్రం గురించి అప్ డేట్ ఇవ్వడం లేదని తన ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -