Jr NTR: మెగా ఫ్యామిలీపై జూనియర్ ఎన్టీఆర్‌కు ఇంత ప్రేమా?

Jr NTR: టాలీవుడ్ ఇండస్ట్రీకి మకుఠం లేని మహారాజు ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి పేరే వినిపిస్తుంది. తెలుగు సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నత శిఖరాలను అధిగమించారు. అలాగే కష్టపడి ఇండస్ట్రీలో రాణిస్తున్న ఎంతో మంది నటీనటులకు ఆయన గాడ్ ఫాదర్ లాంటి వారు. అలాంటి స్టార్ హీరో గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అలాంటి చిరంజీవిపై సినిమా పరంగా పోటీ ఉన్న మరొక కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రశంసిస్తే ఎలా ఉంటుంది. మెగా ఫ్యామిలీతోపాటు తమ అభిమానులకు పట్టలేని ఆనందం దొరుకుతుంది. ప్రస్తుతం అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చిరంజీవిని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందనే విషయాన్ని తెలుసుకుందాం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో బిజీగా ఉన్నారు. అయితే వేరే సినిమా షూటింగ్‌లో బిజీ ఉన్నట్లు కాదు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. అక్టోబర్ 21న ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్‌లో విడుదలైంది. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ జపాన్‌ దేశంలో ప్రమోషన్లు నిర్వహించడంలో బిజీ అయింది. ఈ క్రమంలో రామ్ చరణ్-ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కూడా ప్రమోషన్లలో పాల్గొన్నారు. ప్రయోషన్‌లో భాగంగా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఎన్టీఆర్.. రామ్ చరణ్ వైపు చూస్తూ.. ‘రామ్ చరణ్ తండ్రి తెలుగు సినీ ఇండస్ట్రీలో తిరుగులేని డ్యాన్సర్. ఇండస్ట్రీలో మాకు బెస్ట్ కొరియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. ప్రపంచానికి మైకెల్ జాక్సన్ ఎలాగో.. మా ఇండియాకు ప్రభుదేవా అలా.’ అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. చిరంజీవి పేరు ప్రస్తావించకుండానే ఎన్టీఆర్.. మెగాస్టార్ చిరంజీవిని గ్రేటెస్ట్ డ్యాన్సర్‌గా పొగిడారు. దీంతో అటు మెగా అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -