Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వాచ్ ఖరీదు అన్ని రూ.కోట్లా.. ఏకంగా నాలుగు బంగ్లాలు కొనొచ్చంటూ?

Megastar Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవల భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాలు నడుమ విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పటికే మెగాస్టార్ తదుపరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ సంగతి పక్కన పెడితే తాజాగా మెగాస్టార్ ఇంట రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి.

రాఖీ పండుగ సందర్భంగా కొణిదెల ఆడపడుచులు మెగా బ్రదర్స్‌కి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక అందులో భాగంగానే మెగాస్టార్ ఇంట్లో పూజగదికి సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేశారు. అయితే ఆ ఫోటోలలో మెగాస్టార్ చిరంజీవి చేతికి ఉన్న వాచ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ వాచ్ ద్వారా తెలిసి నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. చిరు చేతికి ఉన్న వాచ్‌ రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్, సహజంగా దాని ధర కూడా భారీగానే ఉంటుంది.

 

దీంతో ఆయన అభిమానులు ఆ వాచ్‌ ధర ఎంతో తెలుసుకోవాలని ఆన్‌లైన్‌లో సర్చ్‌ చేశారు. దాని ధర రూ. 2.35 లక్షల డాలర్లు అని ఉంది. అనగా ఇండియన్‌ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 2 కోట్లు. ఆ వాచ్‌ ధర తెలిసి నెటిజన్స్ నోరెళ్లబెట్టారు. అంత చిన్న వాచ్ ఏకంగా రెండు కోట్ల రూపాయల అని అవాక్కవుతున్నారు. తనకు కార్ల కంటే కొత్త కొత్త వాచీలు కొనడం అంటేనే ఇష్టం అని ఒక ఇంటర్వ్యూలో చిరు చెప్పిన విషయం తెలిసిందే. అందుకే ఆయన వద్ద భారీగానే వాచ్‌ కలెక్షన్స్‌ ఉన్న విషయం తెలిసిందే. కొందరు ఆయన సంపాదిస్తున్నారు కొనుకుంటున్నారు అందులో తప్పేముంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు ఆ ఫోటోలపై స్పందిస్తూ చిరంజీవి ధరించిన ఆ వాచ్ తో నాలుగు బంగ్లాలు కొనుగోలు చేయచ్చు అంటూ కామెంట్స్.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -