KA Paul-KTR: మునుగోడులోనే కేఏ పాల్.. కేటీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా? అంటూ నిలదీత

KA Paul-KTR: మునుగోడు ఉపఎన్నిక ముగియడంతో నియోజకవర్గంలో సందడి వాతావరణం పోయింది. మొన్నటివరకు పార్టీ నేతల హడావుడితో మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా హుషారు కనిపించింది. నేతలు, కార్యకర్తల సందడితో పండుగ వాతావరణంలా కనిపించింది. కానీ ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక ముగియడంతో నేతలందరూ ఎవరి ప్రాంతాలకు వాళ్లు వెళ్లిపోయారు. దీంతో మునుగోడు నియోజకవర్గం ఎప్పటిలాగే సాదాసీదాగా మారిపోయింది. మొన్నటివరకు కళకళలాడిన నియోజకవర్గం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది.

 

 

 

కానీ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాత్రం మునుగోడులోనే ఉన్నారు. తాజాగా మునుగోడు నియోజకవర్గంలో చండూర్ మున్సిపాలిటీలోని అమరవీరు స్థూపం దగ్గర పాల్ మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకుంటానంటూ ఇచ్చిన హామీపై నిలదీశారు. టీఆర్ఎస్ గెలిస్తే మునుగోడును దత్తత తీసుకుంటానంటూ మంత్రి కేటీఆర్ ప్రచారం సమయంలో హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ వెంటనే మునుగోడు నియోజకవర్గానికి వచ్చి దత్తత తీసుకుని అభివృద్ది చేయాలని సూచించారు.

 

 

టీఆర్ఎస్ ను గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గం మొత్తాన్ని దత్తత తీసుకుంటానంటూ మంత్రి కేటీఆర్ ప్రచారంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది నియోజకవర్గ ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఫలితాల రోజు టీఆర్ఎస్ గెలవగానే మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానంటూ పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఇప్పటివరకు కేటీఆర్ నుంచి ఇక ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో కేసీఆర్ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రత్యర్థి పార్టీల నేతలు కోరుతున్నారు. అందులో భాగంగానే తాజాగా మునుగోడులో పర్యటించి కేఏ పాల్.. కేటీఆర్ ఇచ్చిన హామీని గుర్తు చేశారు.మునుగోడు ఉపఎన్నికలో తాను ఓడిపోయిన తర్వాత కూడా ఆ నియోజకవర్గంలో పాల్ పర్యటించడం విశేషం.

Related Articles

ట్రేండింగ్

YCP Schemes: వైసీపీ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి పులిహోర క‌లిపేశారు.. చంద్రబాబుకు జగన్ షాక్!

YCP Schemes: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ జోరుని పెంచేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -