KA Paul: ప్రజాశాంతి పార్టీకి 160 సీట్లు.. ఏపీ రాజకీయాల్లో కామెడీతో హీట్ తగ్గిస్తున్న కేఏ పాల్.. ఏమైందంటే?

KA Paul: మరో నెలన్నర వ్యవధిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అందరి దృష్టి ఏపీ రాష్ట్ర రాజకీయాలపైనే ఉంది. ఇప్పటికే అన్ని పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రజలలోకి వస్తూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈసారి ఎలాగైనా 175 స్థానాలలో విజయం సాధించాలని వైకాపాక్ టార్గెట్ పెట్టుకోగా వైకాపాను గద్దె దించాలని టిడిపి జనసేన కలిసి ఎన్నికల బరిలో దిగబోతున్నారు.

ఇలా అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ప్రజలలోకి వస్తున్నటువంటి తరుణంలో ఏపీ రాజకీయ వేడి రాజుకుంది.ఇలాంటి తరుణంలోనే రాజకీయ వేడిని తగ్గించడం కోసం కేఏ పాల్ రాజకీయ వేడి తగ్గిస్తూ ఆయన చేసే వ్యాఖ్యలు అందరికీ నవ్వు తెప్పిస్తున్నాయి.

తాజాగా కేఏ పాల్ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ రెండు పార్టీల ప్రధాన అధ్యక్షులకు సవాల్ విసిరారు .విజయవాడలో పెద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టారు కదా ఆ విగ్రహం వద్దకు నాతో చర్చకు రావాలి అంటూ జగన్మోహన్ రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడుకి కూడా ఈయన సవాల్ విసిరారు. జనసేన వైసిపి టిడిపి పార్టీలు మూడు బీజేపీకి తొత్తు పార్టీలను ఈ పార్టీలను బలుకు బలహీన వర్గాలు బయటకు రావాలనీ ఈయన తెలిపారు.

వచ్చే ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ 160 స్థానాలు దక్కించుకుంటుందంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మిగిలిన 15 సీట్లు కోసమే టిడిపి జనసేన వైసిపి కొట్టుకుంటున్నారని ఈయన తెలిపారు. ఎవరిని చెప్పిన ప్రజలు తమ పార్టీకే మద్దతు తెలిపి తనని గెలిపిస్తారనీ ఈ సందర్భంగా కేఏ పాల్ చేసినటువంటి ఈ కామెంట్ లో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -