KA Paul: వైరల్ అవుతున్న కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు!

KA Paul: ఎన్నికల యుద్ధంలో గెలవడానికి ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. పెద్ద పార్టీలు పెద్ద పెద్ద వ్యూహాలు రచిస్తూ ప్రణాళికా ప్రకారం ముందుకి వెళ్తున్నాయి. ఇదే సమయంలో సందిట్లో సడేమియలాగా మిగిలిన చిన్నాచితక రాజకీయ నాయకులు కూడా మేము ఉన్నాము అంటూ అప్పుడప్పుడు వస్తుంటారు.

నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అదేనండి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణకాష్టంగా మారిందని అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని చెప్పుకొచ్చారు.

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిని కలవటానికి వెళ్లానని, అక్కడ ఆయన లేకపోవడంతో కలవలేకపోయానని చెప్పుకొచ్చారు పాల్. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి విడుదల చేసిన ఆడియో చూసి షాక్ అయ్యాను కూడా చెప్పారు. ధర్మవరంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు దాడులు దోపిడీలు దారుణం అన్నారు.

అక్కడ జనాలని చూసి షాక్ అయ్యారని కేతిరెడ్డి వద్దు బాబు వద్దు మీరే సీఎం కావాలంటున్నారు అని చెప్పుకొచ్చారు కేఏ పాల్. ఈయన అటు చంద్రబాబునాయుడుని ఇటు పవన్ కళ్యాణ్ ని కూడా వదిలిపెట్టలేదు. పవన్ లా వంద మంది బౌన్సర్లతోనూ, చంద్రబాబుల హై సెక్యూరిటీతోను తిరగటం లేదు సింగిల్ గా తిరుగుతున్నాను.

 

చంద్రబాబు ని దమ్ముంటే తనతో డిబేట్ కి రావాలంటే సవాల్ విసిరాడు. ఎలాగూ లోకేష్ కి మాట్లాడటం రాదు కాబట్టి చంద్రబాబు నాతో డిబేట్ కి రావాలి. చంద్రబాబు చేసిన 100 వాగ్దానాలలో ఒకటి కూడా నెరవేర్చలేదు కానీ మాటలు రాని పప్పుని సీఎం చేయటానికి మాత్రం చాలా అవస్థలు పడుతున్నారు అంటూ సెటైర్లు వేశారు.

పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర వదిలేసి నారాహి యాత్ర చేస్తున్నాడని విమర్శించారు. అయినా 175 స్థానాల్లో పోటీ చేయకుండా 15 సీట్లకే అమ్ముడుపోయారంటూ పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు కేఏ పాల్. తనని కొన్ని మీడియా సంస్థలు కమెడియన్ లాగా చూపిస్తున్నాయని మండిపడ్డారు. ఈ మాటలు అన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -