Kajal Aggarwal: స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కాజల్ అగర్వాల్.. రీ ఎంట్రీ అదిరిపోయిందిగా?

Kajal Aggarwal: తేజ దర్శకత్వంలో తిరిగి వచ్చిన లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కాజల్ అగర్వాల్ అనంతరం చందమామ సినిమాతో మంచి గుర్తింపు పొందారు. ఈ విధంగా వెండితెర చందమామగా ఇండస్ట్రీలో దశాబ్దన్నర కాలం నుంచి తిరుగులేని నటిగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ తన చిన్ననాటి స్నేహితులు గౌతమ్ ను వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం కూడా ఈమె పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇకపోతే వివాహం తర్వాత సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఈమె గర్భవతి అని తెలియడంతోనే వెంటనే తాను కమిట్ అయిన సినిమాల నుంచి తప్పుకొని ఇండస్ట్రీకి విరామం ఇచ్చారు.ఇక ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నాలు చేస్తుంది. అయితే తన రీఎంట్రీ సినిమా అదిరిపోయేలా ఉండాలని ఈమె సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈమె వివాహం కాకుండానే భారతీయుడు2 సినిమాకి కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కాజల్ వెల్లడించారు.ఇది కాకుండా ఈమె తెలుగులో ఒక స్టార్ డైరెక్టర్ సినిమాలో క్రేజీ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో ఈమె హీరోయిన్ కాకపోయినా కథ మొత్తం ఈమె చుట్టూ తిరుగుతుందని, ఈ సినిమాకి హీరో హీరోయిన్ కాజల్ అగర్వాల్ అని తెలుస్తోంది.ఈ డైరెక్టర్ కాజల అగర్వాల్ కు సినిమా కథ చెప్పడంతో ఇందులో కథ మొత్తం తన చుట్టూ తిరుగుతూ ఉండటం వల్లే రీ ఎంట్రీ ఇవ్వడానికి ఇదే సరైన సినిమా అని భావించిన కాజల్ వెంటనే ఈ సినిమాకి సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -