Kajal-Samantha: కాజల్‌కు ఉన్న క్రేజ్ సమంతకు అణువంతైనా లేదా?

Kajal-Samantha: స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో సమంత ఒకరు. సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత వరుసగా ఏదో ఒక సమస్యలో పడుతోంది. ఏడాదిన్నర నుంచి సోషల్ మీడియా, ఇంటర్నెట్ సెర్చింగ్‌లోనూ సమంత క్రేజ్ తగ్గుతూ వచ్చింది. సినిమాల్లోనూ పెద్దగా హిట్ అందుకోవట్లేదు. సమంత హీరోయిన్‌గా నటించిన ‘యశోద’ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ థియేటర్ దగ్గరే బోల్తా కొట్టింది. అలాగే డైరెక్టర్ గుణశేఖర్‌తో ‘శాకుంతలం’ సినిమాకు కూడా బ్రేకులు పడ్డాయి. మరోవైపు హీరో విజయ్ దేవరకొండతో ‘ఖుషీ’ సినిమా కూడా మధ్యలో ఆగిపోయింది. ఇటీవల సమంత అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ‘ఖుషీ’ సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

 

అయితే తాజాగా గూగుల్ సెర్చింగ్‌లో టాప్‌లో నిలిచిన హీరోయిన్ల జాబితా విడుదలైంది. విచిత్రం ఏంటంటే.. ఈ జాబితాలో కాజల్ టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. సమంతలా కాజల్ చేతిలో సినిమాలు లేవు. ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్.. పెళ్లి చేసుకుని బిడ్డను కన్నది. అలాగే సోషల్ మీడియాలో కాజల్ విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. గూగుల్ సెర్చింగ్‌లోనూ టాప్ పొజిషన్‌లో చేరింది. అయితే గూగుల్ సెర్చింగ్‌లో టాప్ 10 హీరోయిన్లు ఎవరనే విషయాన్ని తెలుసుకుందాం. గూగుల్ సెర్చింగ్‌లో టాప్-1లో కాజల్ అగర్వాల్ నిలిచింది. కెరీర్, వ్యక్తిగత విషయాల్లోనూ ఢీలా పడిన సమంత రెండో స్థానం దక్కించుకుంది. అలాగే పుష్ప సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక.. మూడో స్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో తమన్న, ఐదో స్థానంలో నయనతార, ఆరో స్థానంలో అనుష్క, ఏడో స్థానంలో పూజా హెగ్డే, ఎనిమిదో స్థానంలో కీర్తి సురేష్, తొమ్మిదో స్థానంలో సాయిపల్లవి, పదో స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ నిలిచింది.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -