Kamineni Srinivas: రాష్ట్రంలో తెలిసో తెలియకో పిచ్చి మొక్క నాటాం: మాజీ మంత్రి కామినేని

Kamineni Srinivas: మంగళవారం తెనాలిలో దివంగత నేత మాజీ మంత్రి ఎడ్లపాటి వెంకట్రావు నివాసంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు కామినేని శ్రీనివాస్. ఆ తర్వాత ఆయన వినేకర్లతో మాట్లాడుతూ ఇది రాజకీయ సమావేశం కాదని, ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే విషయం భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేతలు చూసుకుంటారని చెప్పారు.

 

రాష్ట్రంలో అనేక అరాచకాలు జరుగుతున్నాయని విమర్శించారు. కరెంటు, పెట్రోలు నిత్యవసరాల ధరలు పెంచిన ప్రభుత్వం రోడ్లు మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమైందని ఆరోపించారు. ప్రజలందరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ పిల్లల కోసం ఆలోచించాలని కోరారు ఈ మేరకు మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రజలు తమ వంతు పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాల క్రితం తెలిసో తెలియకో ఒక పిచ్చి మొక్కను నాటామని వచ్చే ఎన్నికలలో ప్రజలే విజ్ఞతతో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రజలకి సూచించారు కామినేని శ్రీనివాస్. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం నేత ఎడ్లపాటి వెంకట్రావు నివాసంలో నాదెండ్ల మనోహర్ కామినేని భేటీ అవ్వటం, ఆపై వారు అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సమావేశంపై రాజకీయాలలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.

 

ఇది రాజకీయ సమావేశం కాదని కేవలం ఆత్మీయ సమావేశం మాత్రమే అని కామినేని శ్రీనివాస్ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ రాబోయే ఎన్నికల కోసం వీరు ఏకమయ్యారా అనే కోణంలో అందరూ చర్చించుకుంటున్నారు. అయితే వారు ఏ విషయాలపై చర్చించుకున్నారు అనే దానిపై ఎవరికి సరైన స్పష్టత లేదు. ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -