Kantara Effect: కాంతార సినిమా వల్ల అటువంటి నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం.?

Kantara Effect: ఇటీవల కన్నడలో సెప్టెంబర్ 30న తెరకెక్కిన కాంతార సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. మొదట కన్నడలో విడుదల అయ్యి మంచి సక్సెస్ ను అందుకోవడంతో ఈ సినిమాను తెలుగు తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. కన్నడ తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.

ఈ సినిమా అన్ని భాషల్లోనూ సక్సెస్ అవడంతో పాటు రికార్డులను సృష్టిస్తోంది.ఇప్పటికే రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే కాంతార సినిమా ఎఫెక్ట్ తో కర్ణాటక ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

కాంతార సినిమాలో రిషబ్ శెట్టి కర్ణాటకలోని ఆదివాసి సంస్కృతి, సాంప్రదాయాలను అదేవిధంగా భూత కోలా నృత్య కళాకారులను తెరపై అద్భుతంగా చూపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ పాత్రలో రిషబ్ శెట్టి నటనకు గాను ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ విషయంలోనే కర్ణాటక ప్రభుత్వం 60 ఏళ్లు దాటిన భూతకోల నృత్య కళాకారులకు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపింది.

నెలకు 2000 రూపాయలు చొప్పున అర్హులైన వారందరికీ కూడా అందించినట్లుగా తాజాగా ప్రకటించింది. కాగా ఇదే విషయాన్ని బెంగుళూరు సెంట్రల్ ఎంపీ పీసి మోహన్ ట్విట్ చేశారు. భూత కోలా నృత్య కళాకారులకు అలవెన్స్ ఇచ్చేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైకి,మంత్రి సునీల్ కుమార్ కాకర్లకు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు పీసీ మోహన్.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -