Kavitha: జనసేన పార్టీకి వెయ్యి కోట్ల రూపాయల వెనుక కథ ఇదే!

Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు అంతా కేసీఆర్, కవిత చుట్టూనే తిరుగుతోంది. ఏ క్షణంలో కవితను అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి.

ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్ తర్వాత కవిత అరెస్ట్ ప్రచారం మరింత ఎక్కువైంది. సరిగ్గా ఇదే సమయంలో ప్రముఖ ఛానల్స్ కు కవిత ఇంటర్వ్యూలు ఇచ్చారు. లిక్కర్ స్కాంపై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.


లిక్కర్ స్కాంలో తాను చేసిందేమీ లేదనేది కవిత వెర్షన్. ఆమధ్య ఆరు గంటలపాటు సీబీఐ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చారని చెప్పారామె. బీజేపీ అసలు టార్గెట్ తాను కాదని కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. ఛార్టెడ్ ఫ్లైట్‌ లో వెళ్లి తాను ఏం చేశానో వాళ్లే చెప్పాలని బీజేపీ నేతలకు చురకలంటించారు. లిక్కర్ స్కాం కేసుకు తాను భయపడనని.. అరెస్ట్ చేస్తే ప్రజల దగ్గరకు వెళ్తానని తేల్చిచెప్పారు.

ఫోన్లు ధ్వంసం చేశారని దర్యాప్తు సంస్థలు చేసిన ఆరోపణలపైనా స్పందించారు కవిత. తానేమీ ఫోన్లు ధ్వంసం చేయలేదని స్పష్టం చేశారు. దీనిపై ఎవరు ఏం అడిగినా సమాధానం ఇస్తానని తెలిపారు. రూ.130 కోట్ల లంచం అనేది తనకు తెలియదన్నారు. ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ఏపీలో బీఆర్ఎస్‌ కు ఏ పార్టీ ఫేవర్ కాదని కేటీఆర్‌ ను సీఎం చేయడానికే బీఆర్ఎస్‌ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కవిత ఖండించారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ కు వెయ్యి కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు వస్తున్న వార్తలపైనా కవిత స్పందించారు. తామెందుకు పవన్ కు ప్యాకేజీ ఇస్తామని ప్రశ్నించిన ఆమె.. దేశవ్యాప్తంగా తామే అధికారంలోకి రావాలనుకుంటున్నామని చెప్పారు. తమతో ఏకీభవించే పార్టీలు, దేశంలో బీజేపీ పాలనపై పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీకి ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షమని, తెలంగాణలో బీజేపీ తమకు రాజకీయ ప్రత్యర్థి అని వ్యాఖ్యానించారు. ఎవరెవరో ఏవేవో చెబుతుంటారు. మాకు యూపీ, తమిళనాడు, కర్నాటక ఎలాగో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. కాకపోతే, గతంలో కలిసి వున్నాం.. కచ్చితంగా తెలుగు ప్రజల విషయంలో ఒకింత ప్రత్యేకమైన అభిమానంతో ఉంటామని కవిత స్పష్టం చేశారు.

 

 

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -