KCR-Jagan: జగన్ తో కేసీఆర్ కీలక భేటీ? ఉత్కంఠ రేపుతోన్న తెలంగాణ సీఎం విజయవాడ టూర్

KCR-Jagan: ఏపీ సీఎం జగన్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలో సీఎం కేసీఆర్ విజయవాడ టూర్ కు రానున్నారు. ఈ టూర్ లో ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. విద్యుత్ బకాయిల అంశంతో పాటు పోలవరం ప్రాజెుక్టు ఎత్తు పెంపుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినందుకు తమకు ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలని వైసీపీ సర్కార్ డిమాండ్ చేస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వం పలుమార్లు ఫిర్యాదు చేసింది. దీంతో ఇటీవల ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

నెల రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను ఇవ్వాలని డెడ్ లైన్ విధించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మరో వాదనను తెరపైకి తెచ్చింది. ఏపీ ప్రభుత్వమే తనకు బకాయిలు చెల్లించాల్సి ఉందని, కృష్ణపట్నం పోర్టుతో పాటు చాలా పనుల నుంచి ఏపీ తమకు డబ్బులు చెల్లించాల్సి ఉందని, అది తప్పని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానంటూ కేసీఆర్ అసెంబ్లీ సంచలన సవాల్ విసిరారు. ఇక ఇటీవల వరదల సమయంలో పోలవరం ఎత్తు పెంచాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.

పోలవరం ఎత్తు పెంచడం వల్ల వరదల సమయంలో బ్యాక్ వాటర్ ద్వారా భద్రాచలానికి మరింత ముంపు ఉంటుందని, ఏపీ సర్కార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. దీంతో విద్యుత్ బకాయిల అంశంతో పాటు పోలవరం ప్రాజెక్టు వ్యవహారంపై జగన్ తో కేసీఆర్ చర్చించే అవకాశముంది. ఇక జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్న కేసీఆర్.. కొత్త జాతీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే. బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలను, నేతలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. అలాగే జగన్ ను కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా కేసీఆర్ కోరే అవకాశముంది.

మూడేళ్ల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ను ఆహ్వనించేందుకు విజయవాడకు కేసీఆర్ వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో సీబీఐ జాతీయ మహాసభలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనాల్సిందిగా కేసీఆర్ ను సీపీఐ నేతలు ఆహ్వానించారు. ప్రస్తుతం జరుగుతున్న మునుగోడు ఎన్నికలతో పాటు జాతీయ రాజకీయాల్లో సీపీఐ అండ కేసీఆర్ కు అవసరముంది. తెలంగాణలోని నల్గగొండతో పాటు ఖహ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో సీపీఐకు బలం ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే సీపీఐ మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చే నెల 14 లేదా 15న విజయవాడ పర్యటనకు కేసీఆర్ వెళ్లనున్నారు. ఎలాగూ విజయవాడ వెళుతున్నారు కనుక జగన్ ను కలిసే అవకాశముంది. కేసీఆర్, జగన్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే జగన్ ను కేసీఆర్ కలుస్తారని చెబుతున్నారు.

ఇక తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ సీఎం నితీష్ కుమార్, కేరళ సీఎం పినరయి విజయన్ లు కూడా ఈ సమావేశంలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చే అవకాశముంది. 23 దేశాల కమ్యూనిస్టు పార్టీ నేతలు, జాతయీ పార్టీ నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. జాతీయ నేతలు చాలామంది వస్తుండటంతో కేసీఆర్ కూడా హాజరయ్యే అవకాశముంది. అందుకే ఒకేసారి జగన్ ను కలిసి విజయవాడ పర్యటనను సక్సెస్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్ విజయవాడ పర్యటనలో ఎన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Blueberries: ఇవి తింటే మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పని చేస్తుందట.. ఎలా తినాలంటే?

Blueberries: కొన్ని రకాల పండ్లు తినడం వలన అటు ఆరోగ్యానికి, ఇటు మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా ఉపయోగపడతాయి. అటువంటి వాటిలో బ్లూబెర్రీస్ ముందు వరుసలో ఉంటాయి. బ్లూ బెర్రీస్ లో ముఖ్యంగా...
- Advertisement -
- Advertisement -