CM KCR: కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ఫిక్స్.. పార్టీ జెండా, గుర్తు కూడా ఇదే!

CM KCR: సీఎం కేసీఆర్ త్వరలో మరో సంచలన ప్రకటన చేయనున్నారు. గత కొంతకాలంగా మోదీ, బీజేపీపై విరుచుకుపడి విమర్శల దాడి చేస్తున్న కేసీఆర్.. ఎన్డీయే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లో ఎండగడుతున్నారు. కానీ ఇప్పటివరకు బహిరంగ సభలు, ప్రెస్ మీట్ల సమయంలోనే బీజేపీ తీరును తెలియజేస్తున్నారు. కానీ నేరుగా ప్రజల్లోకి వెళ్లి మోదీ పాలనపై పోరాడిన సందర్భాలు లేవు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్.. మోదీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. అందరూ కలిసి రావాలని కోరారు. కానీ జాతీయ రాజకీయాల్లోకి వస్తానని, కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉందని గతంలో పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు. హైదరాబాద్ గడ్డ మీద నుంచే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని, కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించారు.

కానీ ఇప్పుడు కొత్త జాతీయ పార్టీపై కేసీఆర్ మరింత స్పీడ్ పెంచారు. ఇటీవల ప్రగతి భవన్ లో రైతుసంఘాలు నేతలతో సమావేశం తర్వాత జాతీయ పార్టీ ఏర్పాట్లను మరింత వేగవంతం చేశారు. దసరా రోజున కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటన చేస్తారని సమాచారం. ఇప్పటికే పార్టీ పేరు, జెండా, గుర్తు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కానీ పార్టీ పేరు, జెండా, పార్టీ గుర్తు ఏంటనే దానిపై కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైతు పేరు వచ్చేలా పార్టీ పేరును పెట్టినట్లు సమాచారం. అలాగే వ్యవసాయాన్ని ప్రతిబింబించేలా ఆకుపచ్చ రంగులో పార్టీ జెండా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇక కొత్త జాతీయ పార్టీకి రైతునాగలి గుర్తును కేసీఆర్ ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. అయితే కొంతమంది టీఆర్ఎస్ నేతలు మాత్రం గులాబీ రంగులోనే కొత్త జాతీయ పార్టీ జెండా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. రైతులతో పాటు బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని, తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జెండాలో పొందుపర్చవచ్చనే ప్రచారం జరుగుతోుంది. ప్రధానంగా రైతుల అజెండాగానే పార్టీ పేరు, గుర్తు, జెండా ఉంటుందని సమాచారం. ఇటీవల ప్రగతిభవన్ లో దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు.

రాజకీయాల్లోకి రావాలని రైతు సంఘాల నేతలను ఆహ్వానించారు. రైతుల ఉద్యమంతో రాజకీయ ఉద్యమం తోడు అయితే సత్పలితాలు వస్తాయని తెలిపారు. దీంతో కేసీఆర్ కొత్త జాతీయ పార్టీలో రైతులు చేరుతారని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రైతులనే కేసీఆర్ పోటీలోకి దింపుతారనే టాక్ నడుస్తోంది. రైతులకు ఎన్నికల్లో అయ్యే ఖర్చును కేసీఆర్ నే భరించనున్నారట. అంతేకాకుండా పార్టీ ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా రైతులతో, దళితులతో అన్ని రాష్ట్రాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా ఉత్తరాది నుంచి కేసీఆర్ స్టార్ట్ చేయనున్నారు. గుజరాత్, మహారాష్ట్రలో ముందుగా రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ఉత్తరాది రైతుల్లో బీజేపీపై బాగా వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో దానికి క్యాష్ చేసుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. మోదీ ప్రభుత్వం రైతులకు పెద్దగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన దాఖలాలు లేవు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తున్నారు. ఆ పథకం తప్పితే మిగతా పథకాలు ఏమీ రైతులు అంతగా అందడం లేదు. దీంతో రైతుల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మర్చుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.

ఇక కొత్త జాతీయ పార్టీకి ఎలాంటి న్యాయమరమైన చిక్కులు రాకుండా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. న్యాయనిపుణులతో చర్చలు జరిపారు. కేంద్ర ఎన్నికల సంఘంతో కూడా సందప్రదింపులు జరుపుతున్నారు. ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పార్టీకి భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు కేసీఆర్ తీసుకుంటున్నారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి న్యాయనిపుణులతో భేటీ అయ్యే అవకాశముంది.

Related Articles

ట్రేండింగ్

Judges Trolling Case: జడ్జి హిమబిందుని అవమానించేలా పోస్టు పెట్టిన ‍వ్యక్తి అరెస్ట్‌.. ఆ వ్యక్తి ఎవరంటే?

Judges Trolling Case: చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుని అదుపులోకి...
- Advertisement -
- Advertisement -