CM KCR: కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఆ ఎన్నికల తర్వాతనే?

CM KCR: సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల నిజామాబాద్ లో జరిగిన బహిరంగ సభలో కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు చెప్పారు. నిజామాబాద్ గడ్డ మీద నుంచే జాతీయ రాజకీయ ప్రస్ధానం ప్రారంభస్తానని తెలిపారు. గత ఎన్నికలకు ముందు బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ కు కేసీఆర్ ప్రయత్నాలు చేశారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనను పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్లీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. దేశ పర్యటన చేస్తూ ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోకి తనతో కలిసి రావాలని కోరుతున్నారు.

ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, గతంలో ఉద్దవ్ ఠాక్రే సీఎంగా ఉన్న సమయంలో ఆయనను కలిసి బీజేపీయేత ఫ్రంట్ పై చర్చించారు. ఇక యూపీలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కర్ణాకటలో మాజీ ప్రధాని దేవగౌడలను కలిశారు. ఇక ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కూడా కలిశారు. ఇక ఇటీవల బీహార్ సీఎం నితీష్ కుమార్ ను కలిశారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటుకు కలిసి రావాలని కోరారు.

అయితే జాతీయ స్థాయిలో కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని కేసీఆర్ చూస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులతో ప్రగతిభవన్ లో భేటీ అయ్యారు. రాజకీయాల్లోకి రావాలని, రాజకీయ ఉద్యమాలకు రైతు ఉద్యమాలు తోడు అవ్వాలని కోరారు. దీంతో రైతు సమస్యలే ఎజెండాగా కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో అన్ని రాష్ట్రాల్లో భారీ బహిరంగలు ఏర్పాటు చేసి మోదీకి వ్యతిరేకంగా గళం విప్పుతారని చెబుతున్నారు. రైతులనే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీలోకి దింపుతారని చెబుతున్నారు.

కానీ ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నికతో పాటు పాటు మరో ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అందుకే కేసీఆర్ ఇప్పటికిప్పుడు జాతీయ పార్టీ ఏర్పాటు చేయరనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత బాగా పెరిగిందనే అంచనాలు ఉన్నాయి. చాలామంది ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉందనే ప్రచారం ఉంది. ఇలాంటి తరుణంలో జాతీయ రాజకీయాల్లోకి వెళితే మొదటికే మోసం వస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తేనే.. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ను నేతలందరూ గౌరవిస్తారు. అందుకే ముందుగా రానున్న అసెంబ్లీ ఎన్నికలకే కీలకమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఓడితపోతే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా లాభం ఉండదు. అందుకే కేసీఆర్ ఇప్పటికప్పుడు జాతీయ పార్టీ పెట్టే ఆలోచన చేయకపోవచ్చని అంటున్నారు.

అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించిన తర్వాతరనే కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో తనను ఇక్కడ గెలిపిస్తే జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పి మోదీకి వ్యతిరేకంగా పనిచేస్తాననే అంశాన్ని ప్రజల్లోకి కేసీఆర్ తీసుకెళ్లే అవకాశముందని అంటున్నారు. తెలంగాణ బిడ్డ వెళ్లి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే స్థాయికి వెళతారనే అంశాన్ని కేసీఆర్ ఫోకస్ చేసే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత లోక్ సభ ఎన్నికలు వస్తాయి. అప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -