Kilaru Rajesh: సీఐడీ ఆఫీస్‌లో లోకేశ్ స‌న్నిహితుడు.. చంద్రబాబు ఈ కేసు నుంచి బయటపడినట్టేనా?

Kilaru Rajesh: స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ కీలక పాత్ర పోషించాడని, అతను విదేశాలకి పారిపోయాడని ఇప్పటివరకు సీఐడీ చెప్పుకుంటూ వచ్చింది. అయితే సడన్ గా ఈ రాజేష్ అనే వ్యక్తి తాడేపల్లి లోని సిఐడి ఆఫీస్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. అసలు ఏం జరిగిందో చూద్దాం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

ఇప్పటికే ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సీఐడీ అధికారులు అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసులో అవినీతి భాగోతం బయటపడుతుందని భయంతో చంద్రబాబు పీఏ శ్రీనివాస్, లోకేష్ సన్నిహితుడు కిలారి రాజేష్ విదేశాలకు పారిపోయారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. స్వయంగా సిఐడి అధికారులు కూడా మీడియా వాళ్లకి అలాగే చెప్పారు. ఈ రాజేష్ ఎకౌంట్స్ నుంచే లోకేష్ కి పెద్ద మొత్తంలో అవినీతి డబ్బు చేరిందనేది సీఐడీ అధికారుల అభియోగం.

అలాంటి తరుణంలో కిలారు రాజేష్ తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయంలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. విచారణకు రావాలంటే కిలారుకు సీఐడీ రెండు రోజుల క్రితం 41 సి ఆర్ పి కింద నోటీసులు జారీ చేసింది. అయితే రాజేష్ మాత్రం తాను విదేశాలకు పారిపోలేదని, విచారణకు హాజరవుతానని ప్రకటించారు. అతను చెప్పిన విధంగానే సీఐడీ కార్యాలయానికి వెళ్లి సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు రాజేష్.

అయితే ఇదే కిలారు రాజేష్ కొన్ని రోజుల క్రిందట ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ కేసులో తనకు ముందస్తూ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే కిలారి రాజేష్ పేరు ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ లో లేదని చెప్పిన సిఐడి అధికారులు ఆ తర్వాత ఆయన పేరుని ఎఫ్ ఐ ఆర్ లో చేర్చి తర్వాత 41 సిఆర్పి కింద నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించారు. చూడాలి మరి విచారణలో ఎలాంటి నిజాలు వెలుగు చూస్తాయో.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -