CID Notices: మాజీ మంత్రి నారాయణకు భారీ షాక్.. నారాయణ భార్యతో పాటు వాళ్లపై కూడా కేసులు తప్పవా?

CID Notices: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు దర్యాప్తులో ఏపీ సీఐడి దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసు విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుA1 నిందితుడిగాను, మంత్రి నారాయణ A2 నిందితుడిగాను పేర్కొంటూ సిబిఐ చార్జీ దాఖలు చేసింది. ఇందులో ఏ 14 గా మాజీ మంత్రి లోకేష్ పేరు కూడా చేర్చారు సిఐడి వారు. అయితే ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోకేష్ హైకోర్టుని ఆశ్రయించారు.

ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది హెరిటేజ్ సంస్థ రికార్డులపై ఒత్తిడి చేయబోమని తెలిపారు. దీంతో ఈనెల 12వ తేదీ సిఐడి విచారణకు హాజరుకావాలని హైకోర్టు లోకేష్ ని ఆదేశించింది. ఈ కేసు విచారణ లోకేష్ ని మంత్రి నారాయణని కలిపి విచారిస్తారని సమాచారం. అయితే లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు కేసు విచారణ నిమిత్తం 12వ తారీఖున నగరానికి వచ్చేటట్లుగా ఉన్నారు.

ఈ విషయంలో నారాయణ కూడా హైకోర్టుని ఆశ్రయించారు. తాజాగా ఆయన భార్య రమాదేవి తో పాటు ప్రమీల, ఆవుల మణిశంకర్, రావూరి సాంబశివరావు లను ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిందితులుగా చేరుస్తూ సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. వీరిపై పలు సెక్షన్ల కింద సిఐడి కేసు నమోదు చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం తమని కావాలనే కేసులలో ఇరికిస్తుందని కోర్టుకి విన్నవించుకున్నా ఎవరు స్పందించకపోవడం విశేషం.

చంద్రబాబు హయాంలో అమరావతి మాస్టర్ ప్లాన్ లో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం, అలాగే వాట్సాప్ లో నారాయణ కి వాట్సాప్ ద్వారా సిఐడి నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. అయితే మంత్రి నారాయణ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 60 ఏళ్ల వయసు వచ్చింది కాబట్టి స్టేషన్ కి రాలేనని, పోలీసులు ఇంటికి వచ్చి విచారణ జరిపించాలని లంచ్ మోషన్ లో కోరారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -