KL Rahul: ఈనెలలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్న టీమిండియా ఓపెనర్

KL Rahul: టీమిండియా సీనియర్ ఆటగాడు, టీ20లలో ఓపెనర్ కేఎల్ రాహుల్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. కొంతకాలంగా బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అథియా శెట్టితో కేఎల్ రాహుల్ ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. అయితే అందరిలా కాకుండా తమ ప్రేమ వ్యవహారాన్ని వీళ్లిద్దరూ రహస్యంగా ఉంచకుండా బాహాటంగానే రివీల్ చేశారు. దీంతో సమయం చిక్కినప్పుడల్లా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటవ్వడానికి సిద్ధమవుతున్నారు.

 

తాజా సమాచారం ప్రకారం కేఎల్ రాహుల్ పెళ్లి ఈనెల 23న జరగనున్నట్లు తెలుస్తోంది. ముంబై సమీపంలోని ఉండే ఖండాలాలోని అథియా తండ్రి సునీల్ శెట్టి నివాసంలో ఈ వివాహం వైభవంగా జరగబోతోంది. అయితే కేఎల్ రాహుల్, అథియాల వివాహ వేడుక మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. అతికొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలకు హాజరు కానున్నారు.

 

ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లికి హాజరు కానున్న అథితుల జాబితా సైతం రెడీ అయ్యింది. కండలవీరుడు సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్, అక్షయ్ కుమార్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలతో పాటు మరికొందరు ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది.

 

మూడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న రాహుల్-అథియా
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, అథియా శెట్టి గత మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఈ పరిచయం ప్రేమగా మారింది. గతేడాది అథియా పుట్టినరోజు సందర్భంగా తమ రిలేషన్‌షిప్‌పై కేఎల్ రాహుల్ అధికారిక ప్రకటన చేశాడు. దీంతో ఇరు కుటుంబాలు వీళ్లిద్దరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 23న పెళ్లిపీటలెక్కుతున్నారు. ఇప్పటికే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా బాలీవుడ్ నటి అనుష్క శర్మను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా కోహ్లీ బాటలోనే నడుస్తున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -