Kodali: పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కొడాలి.. బట్టలూడదీసి రోడ్డుపై నిలబెడతానంటూ?

Kodali: మాజీ మంత్రి వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం అధినేతలపై అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు చంద్రబాబు లోకేష్ ను దారుణమైన కామెంట్లతో చెడిగుడి ఆడినటువంటి కొడాలి నాని తాజాగా పవన్ కళ్యాణ్ పై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అంటూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ ను చదువుతూ నిజానిజాలు ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నారు.

ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో మండిపడుతున్నటువంటి వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో పవన్ పై విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొడాలి నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చారు.పవన్ కళ్యాణ్ నువ్వు రాజకీయాలలోకి రావడం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు సొంతంగా రాజకీయాలలోకి వచ్చి వైసీపీ ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించు దానికి మేము ఏ మనం కానీ చంద్రబాబు నాయుడుతో కలిసి చంద్రబాబు నాయుడు ఇచ్చే స్క్రిప్ట్ చదువుతూ వైసిపి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం అస్సలు వదలననీ తెలిపారు.

 

చంద్రబాబు నాయుడుతో పాటు నిన్ను కూడా గుడ్డలూడదీసి రోడ్డుపై నిలబెడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.నిజా నిజాలు తెలుసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బాగుంటుంది అలా కాకుండా ఎవరితోనో పొత్తుకు సిద్ధమవుతూ పొత్తు విషయంలో క్లారిటీ లేకుండా ఇచ్చిన స్క్రిప్ట్ చదివి మాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మా రియాక్షన్స్ కూడా అలాగే ఉంటాయని నాని తెలిపారు. ఇక నాని పవన్ కళ్యాణ్ కు ఒక సూచనలు కూడా చేశారు నువ్వు చంద్రబాబు నాయుడు చేతిలో వెన్నుపోటుకి సిద్ధమైతేనే అతనితో పొత్తు పెట్టుకో అంటూ తెలిపారు.

 

నువ్వేమీ ఎన్టీ రామారావు గారి కన్నా గొప్పోడివి కాదు ఆయననే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయనకు నువ్వు ఒక లెక్క ఆయన రక్తంలో ప్రతి అణువులోనూ ఇదే ఉంది. నువ్వు కూడా వెన్నుపోటుకు సిద్ధమైతేనే పొత్తు పెట్టుకో..లేదా ఒంటరిగా రంగంలోకి వచ్చి 24 గంటలు ప్రజలలోనే ఉండి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపు అంతేకానీ ఇలా ఎవడో చెప్పమన్న మాటలను చెబుతూ వైసిపి పార్టీపై ముఖ్యమంత్రి జగన్మోహన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదు అంటూ ఈ సందర్భంగా కొడాలి నాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -