Kodali Nani-Balakrishna: బాలయ్యకు సిగ్గుందా.. తండ్రిని చంపిన వాళ్లతో షోలు అవసరమా?

Kodali Nani-Balakrishna: నందమూరి బాలకృష్ణ ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం మొదటి సీజన్ ఎంతో విజయవంతంగా పూర్తి కాగా రెండవ సీజన్ కూడా ఘనంగా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఈ కార్యక్రమం అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రసారం కానున్నట్లు ఇదివరకే ప్రోమో కూడా విడుదల చేశారు. అయితే ఈ సీజన్లో మాత్రం మొదటి గెస్ట్ గా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ హాజరుకానున్నారు.

ఈ క్రమంలోని ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. అయితే ఈ ప్రోమోలో చంద్రబాబు నాయుడు వ్యక్తిగత జీవితానికి సంబంధించి అలాగే రాజకీయ జీవితానికి సంబంధించిన విషయాలను కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.అయితే ఈ ప్రోమో ద్వారా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ కార్యక్రమం పై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు.

ఈ సందర్భంగా కొడాలి నాని బాలకృష్ణ షోపై స్పందిస్తూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు 420. ఈయన ఎన్టీఆర్ కాళ్ల దగ్గరే ఉండి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి.ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాక్కొని ముఖ్యమంత్రి అయిన నువ్వు తెలుగుదేశం పార్టీని కాపాడేది ఏంటి?ఇలా వెన్నుపోటుతో పార్టీని లాక్కున్న గజదొంగ చంద్రబాబు అంటూ ఈయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఎన్టీఆర్ గారికి తీవ్రస్థాయిలో అన్యాయం చేస్తున్న నిన్ను తెలుగుదేశం నేతలు అభిమానులు ఎప్పటికీ క్షమించారని కొడాలి నాని మండిపడ్డారు. ఇలాంటి ఒక నమ్మకద్రోహిని, తండ్రిని చంపిన వాడిని ఈ కార్యక్రమానికి పిలిచి ముచ్చటించడానికి సిగ్గు లేదా బాలకృష్ణ అంటూ ఈయన మండిపడ్డారు. బాలయ్యకు సిగ్గు, శరం లేదు నీ తండ్రికి ద్రోహం చేసిన అతని కొడుక్కి తిరిగి పిల్లనిచ్చావు. మరి ఆ వ్యక్తిని తీసుకువచ్చి ఈ షోలో పెడతావా అంటూ తీవ్రస్థాయిలో కొడాలి నాని బాలకృష్ణ పై మండిపడ్డారు. ప్రస్తుతం ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -