Kohli: అరుదైన రికార్డు సృష్టించి కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలోనే రేర్ ఫీట్

Kohli: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో 50 హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ చెలరేగాడు. కేవలం 49 బంతుల్లోనే 82 పరుగులు చేసి పరుగులు మోత మోగించాడు. ఫోర్లు, సిక్సర్లతో ముంబై బౌలర్లకు కోహ్లీ చుక్కలు చూపించాడు. ఈ హాఫ్ సెంచరీతో ఐపీఎల్‌లో 50 అర్థశతకాలు సాధించిన తొలి భారత క్రికెటర్ గా నిలిచాడు.

ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెస్ డేవిడ్ వార్నర్ 60 అర్ధశతకాలు చేశాడు. దీంతో డేవిడ్ వార్నర్ తొలి స్థానంలో ఉండగా.. కోహ్లీ 50 హాఫ్ సెంచరీలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక పంజాబ్ కెప్లెన్ శిఖర్ ధావన్ 49 హాఫ్ సెంచరీలో మూడో స్థానంలో ఉన్నాడు. భారత బ్యాట్స్‌మెన్లలో ఐపీఎల్ లో 50 హాఫ్ సెంచరీలు చేసి కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో కోహ్లీతో పాటు ఆర్సీబీ కెప్టెన్ డూప్లెసిస్ కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. దీంతో ఆర్సీబీ గెలుపు సులువైంది.

 

అయితే ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 92 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ముంబై బ్యాట్స్‌మెన్స్ తిలక్ వర్మ 84 పరుగులతో రెండో స్థానం, విరాట్ కోహ్లీ 82 పరుగులతో మూడో స్థానం, కల్ మేయర్స్ 73 పరుగులతో నాలుగో స్థానంలో, డుప్లెసిస్ 73 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నారు. ఇక బౌలర్ల పర్పుల్ క్యాప్ విషయంలో మార్క్ వుడ్ 5 వికెట్లతో అగ్రస్థానంలో నిలవగా..చహల్ 4 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -