NTR 30: ఎన్టీఆర్ ను అలా చూపించడం అవసరమా కొరటాల.. ఫ్యాన్స్ ఫీలయ్యారుగా!

NTR 30: టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర. ఇది ఇలా ఉంటే నేడు అనగా మే 20 న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా చిత్ర బృందం సినిమాలో ఎన్టీఆర్ లుక్ కి సంబంధించిన పోస్టర్ ని అలాగే సినిమా టైటిల్ ని రివీల్ చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి రెండు అప్డేట్ లను విడుదల చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఇది ఇలా ఉంటే నెటిజన్స్ ఎన్టీఆర్ పోస్టర్ పై నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ముఖంలో కూడా పెద్దగా ఎక్స్ప్రెషన్స్ కనిపించడం లేదు. ఎన్టీఆర్ ఏవైనా ఫంక్షన్లకు వస్తే, చికాగ్గా, సీరియస్ గా మొహంలో ఫీలింగ్స్ కనబరిస్తే ఎలా వుంటుందో అలాగే వుంది. వాస్తవానికి ఎన్టీఆర్ ఫేస్ కు ఇలాంటి చికాకు లుక్ సెట్ కాదు. కానీ నిజానికి కొరటాల మొదటి నుంచి చెబుతున్నది ఏమిటి? కానీ ఫేస్ లో ఎక్కడ ఎక్స్ ప్రెషన్స్ చూస్తే రౌద్రం, భయానకం ఇలాంటివి ఏవీ లేవు. జస్ట్ సీరియస్ నెస్ మాత్రమే పోస్టర్ లో కనిపిస్తోంది. పైగా ఇలాంటి ఫస్ట్ లుక్స్ లాంటివి కాస్త బెటర్ క్లోజ్ అప్ ఇస్తే వేరుగా వుంటుంది. ఇంటెన్సిటీ తెలియాలంటే ఇంకా బెటర్ గా చేసి వుండాల్సింది.

 

పైగా ఎన్టీఆర్ ఫేస్, గెటప్ లో పెద్దగా మేకోవర్ లేదు. బ్లాక్ డ్రెస్ అన్నది ఈ మధ్య చాలా మంది హీరోలకు కామన్ అయిపోయింది. మొత్తానికి తాజాగా విడుదల చేసిన పోస్టర్ పై పాజిటివ్ గా కంటే నెగిటివ్ గానే ఎక్కువగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇకపోతే ఎన్టీఆర్ సరసన ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -