Janhvi Kapoor: జాన్వీని అలా చూపించనున్న కొరటాల.. మామూలుగా లేదుగా!

Janhvi Kapoor: తెలుగు సినీ ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. దాంతో ఎన్టీఆర్ తదుపరి సినిమా ఎన్టీఆర్ 30 సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ 30 సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

 

ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అంతేకాకుండా ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ప్రజలు చేయబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ విషయానికి వస్తే.. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి జాన్వీ కపూర్ ఫోటోషూట్ కూడా ముగిసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ కపూర్ కి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేశారు చిత్ర బృందం.

ఆ పోస్టర్లో జాన్వి కపూర్ ఒక ప్రవాహం పక్కన రాతిపై కూర్చొని లంగావోణి ధరించి నడుము పక్క నుంచి ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. సరికొత్త లుక్ లో కనిపిస్తూ అదరగొడుతోంది జాన్వీ కపూర్. ఇక అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు జాన్వీ కపూర్ ఫోటోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా తాజాగా విడుదల చేసిన జాన్వీ కపూర్ పోస్టర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ కీ సంబంధించిన పోస్టర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -