Koratala Siva: దేవరతో హిట్ కొట్టి చిరంజీవిపై పగ తీర్చుకోనున్న కొరటాల.. రివేంజ్ స్కెచ్ ఇలా ప్లాన్ చేశారా?

Koratala Siva: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఎన్టీఆర్ తదుపరి సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.

ఇక ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు ఇకపోతే ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ ఈ సినిమాని చేయడం వెనుక భారీ ప్లాన్ ఉందని తెలుస్తోంది.

ఈ సినిమా కంటే ముందుగా కొరటాల శివ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో కొరటాల ప్రమేయం చిరంజీవి ప్రమేయం ఎక్కువగా ఉంది అంటూ వార్తలు వచ్చాయి. అందుకే ఈ సినిమా కొరటాల అనుకున్న విధంగా తీయకపోవడంతోనే డిజాస్టర్ గా మిగిలింది అంటూ ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ సినిమా కారణంగా కొరటాల మాత్రం డిజాస్టర్ డైరెక్టర్ అనే ట్యాగ్ తగిలించుకోవాల్సి వచ్చింది.

ఇక ఆచార్య సినిమాతో తనకు డిజాస్టర్ డైరెక్టర్ గా పేరు ఇచ్చారు. అయితే ఈ పేరును తొలగించుకోవడం కోసం దేవర సినిమా ద్వారా సూపర్ హిట్ అందుకొని తనని డిజాస్టర్ డైరెక్టర్ అన్నవారికి తగిన గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంలోనే కొరటాల ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఈ సినిమాని తెరెకేక్కిస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా సక్సెస్ అనేది ఇటు కొరటాల శివకు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ కి కూడా చాలా కీలకంగా మారింది అని చెప్పాలి. మరి దేవర సినిమా ద్వారా ఎన్టీఆర్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు...
- Advertisement -
- Advertisement -