Kota Srinivasa Rao: ఒక్క ఛాన్స్‌ అంటూ కోట శ్రీనివాసరావు ఆ హీరోలను అడిగాడట.. అసలు విషయం ఇదే!

Kota Srinivasa Rao:  ఒకప్పుడు విలన్‌ అయినా.. హీరో, హీరోయిన్‌ తండ్రి పాత్ర నటించాలంటే కోట శ్రీనివాసరావును మించిన వారు ఉండేవారు కాదు. ఎలాంటి పాత్ర ఇచ్చిన అందులో ఒదిగిపోయి ఆ పాత్రకు సరైన న్యాయం చేసేవాడు. టాలీవుడ్‌ లెజెండ్‌ నటుడు కోటా శ్రీనివాసరావు భిన్న విభిన్న పాత్రల్లో నటించి మైమరిపించాడు. ప్రస్తుతం కోట శ్రీనివాసరావు వయోభారంతో ఇంట్లోనే కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది.

ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో నటిస్తూ బిజిబిజిగా ఉంటూ కోట శ్రీనివాసరావు ఇప్పుడు ఖాళీగా ఉండేందుకు నానా తంటలు పడుతున్నాడంట. ఇంట్లో ఖాళీగా కూర్చుని తినడం ఇబ్బందిగా ఉందంటూ సన్నిహితుతో ఆవేదన వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలను చేశాడు. ఇటీవల తాను ఏ సినిమా దర్శకుడిని లేదా హీరోని కలిసిన కూడా ఏదో ఒక వేషం ఇవ్వాలంటే కోరుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. మహేష్‌ బాబు, ఎన్టీఆర్, త్రివిక్రమ్, నాని ఇలా ఎంతో మందిని ఒక్క ఛాన్స్‌ ఇవ్వమంటూ అవకాశం కోసం అడిగానని కోట శ్రీనివాసరావు పేర్కొన్నాడు.

మహేష్‌ బాబు కనిపించిన సమయంలో సినిమా అవకాశం ఇవ్వమని అడిగితే మీలాంటి వాళ్లు ఇలా అడగడం ఏంటండీ అన్నాడని కోట శ్రీనివాసరావు అన్నారు. మహేష్‌తో పాటు ఎన్టీఆర్, నాని కూడా కలిసిన సమయంలో సినిమా అవకాశం కోసం అడిగానని వారు కూడా అదే సమాధానాన్ని చెప్పారంటూ కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చాడు.మొత్తానికి కోట శ్రీనివాసరావు ఇంకా నటించాలనే కోరికతో ఉన్నారు. కానీ ఆయన వయసుకి తగ్గ పాత్రలు దొరకడం కష్టంగా మారింది. ఇప్పటికే ఆయన వయోభారంతో పలు సమస్యలను ఇంకా షూటింగ్‌ అంటూ పాల్గొంటే ఆయనకు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని ఇక సినిమాల జోలికి వెళ్లకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటే మంచిదని అభిమానులు, సినిమా పెద్దవాళ్లు అభిప్రాయపడుతూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -