Kota Srinivasa Rao: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు కోటా శ్రీనివాస్ రావు?

Kota Srinivasa Rao: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన నటుడు కోట శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో సినిమాలలో కమెడియన్ గా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటించి అందరిని భయభ్రాంతులకు గురిచేసిన కోటా శ్రీనివాసరావు ప్రస్తుతం వయసు పై పడటంతో ఈయన పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈ విధంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఈయన యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూ ఇస్తూ సినీ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విధంగా కోటా శ్రీనివాసరావు ఇప్పటికే ఎంతోమంది హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి యంగ్ హీరోల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆయనలో మంచి పొటెన్షియాలిటీ ఉందంటూ తనపై ప్రశంసలు కురిపించారు.

అచ్చం తన తాతగారిలాగే ఎన్టీఆర్ లో కూడా మంచి పొటెన్షియాలిటీ ఉందని ఆయనలో ఎంతో టాలెంట్ దాగి ఉందంటూ ఈయన తెలిపారు.ఆయన డైలాగ్ చెప్పే విధానం కానీ డాన్సులు గాని ఎంతో అద్భుతంగా ఉంటాయని కోట వెల్లడించారు. ఇక ఈయనతో పాటు మహేష్ బాబు బన్నీ కూడా మంచిగానే నటిస్తారని కోట వెల్లడించారు. అయితే ఎన్టీఆర్ లో ఉండే పొటెన్షియాలిటీ ఎవరిలోనూ లేవని ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇకపోతే మెగా హీరో రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ఆయనలో పెద్దగా నటుడిని గుర్తించలేకపోయానని ఆయన చిరంజీవి వారసుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని రామ్ చరణ్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆయనకు కూడా సరైన పాత్ర పడితే తన కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు అంటూ ఈ సందర్భంగా టాలీవుడ్ యంగ్ హీరోల గురించి కోటా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -