KTR: కాంగ్రెస్ కు ఇద్దరు ఎంపీలు గుడ్ బై చెబుతారా? కేటీఆర్ వ్యాఖ్యలపై ఏమంటున్నారంటే?

KTR:  కాంగ్రెస్ కు ఇద్దరు ఎంపీలు గుడ్ బై చెబుతారని, త్వరలో ఆ ఇద్దరు తమ పార్టీలో చేరుతారని ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలం రేపుతోన్నాయి. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కేటీఆర్.. ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు తమ పార్టీలో చేరుతారంటూ బాంబ్ పేల్చారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోన్నాయి. ఆ ఇద్దరు ఎంపీలు ఎవరనే దానిపై హస్తం పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ నుంచి గత లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలిచారు. మల్కాజ్ గిరి నుంచి ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి గెలవగా.. భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్లగొండ నుంచి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు.

ఆ ముగ్గురు ఎంపీలతో ఇద్దరు చేరుతారంటూ మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి అసలు టీఆర్ఎస్ లో చేరే ప్రసక్తే ఉండదు. ఇక కేసీఆర్ ను తీవ్రంగా వ్యతిరేకించే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ చేరే అవకాశం లేదు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయానికొస్తే మాజీ టీపీసీసీ చీఫ్ గా ఉన్నారు. కాంగ్రెస్ లో ఆయనకు సముచిత స్ధానం ఉంది. అలాంటప్పుడు ఆయన కూడా టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉండదు. అలాంటిది కేటీఆర్ ఇద్దరు ఎంపీలు టీఆర్ఎస్ లో చేరుతారని ప్రకటించడం సంచలనం రేపుతోంది. టీఆర్ఎస్ లో చేరుతారని చెప్పిన ఆ ఇద్దరు ఎంపీ పేర్లను మాత్రం కేటీఆర్ ప్రకటించలేదు.

దీంతో మునుగోడు ఉపఎన్నిక క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కేటీఆర్ మైండ్ గేడ్ ఆడుతున్నారనే విమర్శలు కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. త్వరలో తెలంగాణలోకి రాహుల్ జోడో యాత్ర అడుగుపెట్టనుంది. ఈ నెల 27 నుంచి రాహుల్ పాదయాత్ర కర్ణాటక నుంచి తెలంగాణలోకి అడుగుపెట్టనుంది. దీంతో కాంగ్రెస్ నేతల ఆత్మస్థైరాన్ని దెబ్బకొట్టేందుకు కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. తమ పార్టీలో ఉన్నదే ముగ్గురు ఎంపీలని, వారితో ఇద్దరు పార్టీ మారుతారని చెప్పడం దుర్మార్గమని తెలిపారు.

ఒక ఎంపీ పీసీసీ అధ్యక్షుడుగా ఉండగా.. మరో ఎంపీ మాజీ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నారని, మరో ఎంపీ పీసీసీ పదవి కోసం పోటీ పడ్డారని జగ్గారెడ్డి తెలిపారు. అలాంటప్పుడు పార్టీ ఎందుకు మారుతారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే కేటీఆర్ కు పదవులు, హోదాలు వచ్చేవి కాదన్నారు. కేటీఆర్ మాటలకు విలువ పెంచిందే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ పుట్టుకతోనే కింగ్ అని, కేటీఆర్ మిడిల్ ఏజ్ కింగ్ అని జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నుంచి ఎంపీలెవ్వరూ పార్టీ మారరని, కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారని, తప్పుడు మాటాలు చెబుతారని జగ్గారెడ్డి అన్నారు.

కాగా కేటీఆర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం రేపుతోన్నాయి. ఇటీవల మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కాంగ్రెస్ ను వీడి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.నల్లాల ఓదేలు టీఆర్ఎస్ లో చేరే వరకు ఎవరికీ తెలియదు. అంతా సీక్రెట్ గా ఆపరేషన్ మొత్తం జరిగింది. రహస్యంగా కాంగ్రెస్ నేతలతో టీఆర్ఎస్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎంపీలు కాకపోయినా.. మాజీ ఎంపీలు, కీలక నేతలు ఎవరైనా పార్టీ మారేందుకు సిద్దమ్యారా అనే చర్చ జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts