Kumari Aunty: కుమారి ఆంటీకు పోలీసులు షాక్ ఇవ్వడం వెనుక అసలు కారణాలివేనా?

Kumari Aunty: ఈ మధ్యకాలంలో ఇంస్టాగ్రామ్ లో యూట్యూబ్ లో ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా వినిపిస్తున్న పేరు సాయి కుమారి. రోడ్డు పక్కన ఫుడ్ ని అమ్ముతూ రోజుకు వేలల్లో సంపాదిస్తూ బాగా పాపులర్ అయింది. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఆమె వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఆమె మరింత పాపులర్ అవడంతో పాటు కస్టమర్లు రావడం ఎక్కువ అయ్యారు. దానికి తోడు ఆమె దారుణంగా ట్రోలింగ్స్ చేయడం కూడా మొదలుపెట్టారు. మాదాపూర్‌లోని ఐటీసీ కోహీనూర్‌ హోటల్‌ సమీపంలో స్ట్రీట్‌ ఫుడ్ బిజినెస్‌ చేస్తోన్న ఆమె గత కొన్ని రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. కుమారీ ఆంటీ ఫుడ్‌ బిజినెస్‌ రోజుకు లక్షల్లో సాగుతుందని ,సెలబ్రిటీలు సైతం ఆమె దగ్గరికి వచ్చి భోజనం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ వీడియోలు ఊదరగొట్టేశాయి.

 

అయితే ఇలా గత కొన్ని రోజులుగా నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్న కుమారీ ఆంటీ ఇప్పుడు కష్టాల్లో పడింది. చుట్టు పక్కల ప్రాంతాల్లోని యువత ఎక్కువగా కుమారీ ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు ఎగబడడంతో రద్దీ ఎక్కువైపోతుంది. ఈ ఫుడ్‌ స్టాల్‌కు వచ్చిన వారు రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా ఈమె డబ్బులు కూడా ఎక్కువగా లాగుతుందని కస్టమర్లు ఎక్కువగా అయ్యేసరికి ధరలు భారీగా పెంచేసింది అంటూ దారుణంగా ట్రోలింగ్స్ నెగటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టేశారు. అలాగే ఆమె ఫోటోలు దగ్గరకు భారీగా కస్టమర్లు రావడంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ అవుతుందంటూ పోలీసులు కుమారీ ఆంటీపై కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆమె బిజినెస్‌ను క్లోజ్‌ చేయించారు.

దీనిపై కుమారీ ఆంటీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. దీంతో అందరూ కుమారి ఆంటీ పని అయిపోయిందని అనుకున్నారు. అయితే తాజాగా ఇదే విషయంపై టాలీవుడ్‌ ప్రముఖ హీరో సందీప్‌ కిషన్‌ స్పందించారు. సొంతంగా వ్యాపారం చేసి కుటుంబానికి అండగా నిలవాలనుకునే వారికి ఆమె ఆదర్శం. ఈ మధ్య కాలంలో నేను చూసిన బలమైన మహిళా సాధికారిత ఉదాహరణల్లో ఇది కూడా ఒకటి. నేను, నా టీమ్‌ తరఫున సాధ్యమైనంతవరకు ఆమెకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తాం అని సందీప్‌ కిషన్‌ ట్వీట్‌ చేశారు. అలాగే సాయి కుమారి ఆంటీ బిజినెస్ క్లోజ్ చేయించడం పై ట్రాఫిక్ పోలీసులు కూడా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ మార్గంలో స్ట్రీట్‌ ఫుడ్‌ బిజినెస్‌కు ఎలాంటి అనుమతులు లేవు. ఇది వీరి సొంత స్థలం కాదు. ఈ బిజినెస్‌ కారణంగా చాలా కాలంగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ఇక్కడకు వచ్చే వందమంది కారణంగా వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకే చర్యలు తీసుకోక తప్పలేదు అని స్థానిక ట్రాఫిక్‌ పోలీసులు వివరణ ఇచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -