Munugode Bye-Poll: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని ఫైనల్ చేసిన కేసీఆర్?

Munugode Bye-Poll: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నిక హాట్ టాపిక్ మారింది. సాధారణ అెసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉండటంతో.. మునుగోడును పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వచ్చే ఎన్నికలకు సెమీ ఫైనల్ కు మునుగోడు బై పోల్ ను పార్టీలన్నీ భావిస్తున్నాయి. అందుకే ఇంకా నోటిఫికేషన్ రాకముందు పార్టీలన్నీ ఎప్పటినుంచో ప్రచారం ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్ తరపున గులాబీ అధినేత కేసీఆర్.. బీజేపీ తరపున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బహిరంగ సభ నిర్వహించారంటే ఈ ఉపఎన్నికలను ఆ రెండు పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అర్ధమవుతుంది.

ఇక టీఆర్ఎస్, బీజేపీ కంటే ముందే మునుగోడులో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. త్వరలో ప్రియాంకగాంధీతో కాంగ్రెస్ మునుగోడులో బహిరంగ సభ నిర్వహించే అవకాశముంది. ఇప్పటికే బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యర్ధి కాగా.. కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి రెడ్డిని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అయితే టీఆర్ఎస్ ఇంకా తమ అభ్యర్ధిని ప్రకటించలేదు. టీఆర్ఎస్ లో టికెట్ కోసం భారీ పోటీ పడుతున్నారు. ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీంతో నేతలు అసంతృప్తికి గరి కాకుండా ఉండేందుకు ఎవరిరి టికెట్ ఇవ్వాలనే దానిపై సీఎం కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు.

అయితే మునుగోడు టికెట్ ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై సీఎం కేసీఆర్ ఒక క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించ ేఅవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనిని అధికారికంగా ప్రకటించే అవకాశముంది. మునుగోడులో 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. దీంతో మాజీ ఎమ్మల్యేకే టికెట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకకన్నట్లు తెలుస్తోంది. ఆయనకే టికెట్ ఇవ్వాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారని సమాచారం. ఆయన పేరును అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని తెలుస్తోంది.

తాజగా ప్రగతిభవన్ లో నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. వెంటనే ప్రగతిభవన్ కు రావాల్సిందిగా జగదీశ్వర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డికి ప్రగతిభవన్ నుంచి పిలువువచ్చింది. అత్యవసరంగా పిలుపు రావంతో ఇరువకు వెళ్లి కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భగా మునుగోడు ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని నేతలకు కేసీఆర్ సూచించారట. ఆత్మీయ సమ్మేళనాల్లో కూసుకుంట్ల పేరును హైలెట్ చేయాలని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.

మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా కూసుకుంట్లకే టికెట్ ఇవ్వాలని కేసీఆర్ ను కోరుతూ వస్తున్నాయి. కేసీఆర్ తో సమావేశానికి మిగతా నేతలను కూడా ఆహ్వానించలేదు. దీంతో కూసుకకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టికెట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -