Jagan-Pawan: జగన్ ను కచ్చితంగా దించి తీరదాం.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Jagan-Pawan: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి మూడవ దశ పాదయాత్రను ముగించారు. ఈ క్రమంలోనే ఈయన విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అధికార ప్రభుత్వంపై యధావిధిగా విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ…

 

వచ్చే ఎన్నికలలో కొత్త ప్రభుత్వం రాగానే ఇప్పుడు జరిగే తప్పులకు వైకాపా దోపిడీదారులు వారికి కొమ్ముకాస్తున్నటువంటి అధికారులు జవాబుదారులుగా ఉండాలని వారే సమాధానాలు చెప్పాలని ఈయన తెలియజేశారు.కచ్చితంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని గద్దె దించుతం అని తెలిపారు. వచ్చేది జనసేన ప్రభుత్వమా లేకపోతే మిశ్రమంగా తెదేపాతో కలిసిన జనసేన సంకీర్ణ ప్రభుత్వమా అనే పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని ఈయన తెలిపారు.

వచ్చేది ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి దోపిడీలకు జవాబుదారీగా అధికారులు ఉండాలని వారి సమాధానాలు చెప్పాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.వచ్చే ఎన్నికలలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో తెలియదు కానీ జగన్ ప్రభుత్వాన్ని మాత్రం అడ్డుకోవాలని అలాగే ఏ పార్టీ వచ్చిన రాష్ట్ర సంక్షేమమే తనకు ముఖ్యం అంటూ ఈయన తెలిపారు.

 

ప్రకృతి వనరులను అడ్డంగా దోచుకుంటున్నటువంటి వైకాపా నేతలను చూస్తుంటే ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వమే నయం అనే భావన కలుగుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.గత పది సంవత్సరాలుగా ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నానని ఈయన తెలిపారు. గతంలో చెప్పినట్టు ఇప్పటికీ ముఖ్య మంత్రి పదవికి తాను కూడా సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

 

ముఖ్యమంత్రి కావాలని నేనొక్కటే అనుకుంటే సరిపోదు ప్రజలు కూడా అనుకోవాలని వారు మా ఎమ్మెల్యేలపై నమ్మకం పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.ఈ విధంగా పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సిపి పార్టీ గురించి పలు విమర్శలు చేస్తూ వచ్చే ఎన్నికలలో ఈ పార్టీని ఎలాగైనా గద్దె దింపబోతున్నాము అంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -