Urvasivo Rakshasivo: అల్లు శిరీష్ సినిమాలో అన్ని లిప్ లాక్ సన్నివేశాలా?

Urvasivo Rakshasivo: దాదాపు రెండేళ్ల విరామం తర్వాత హీరో అల్లు శిరీష్ రొమాంటిక్ సినిమాలో నటించారు. డైరెక్టర్ రాకేశ్ శశి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. ఈ సినిమాలో హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్ నటించారు. ఈ సినిమాను తమిళంలో ‘జెర్సీ’ ఫేమ్ హరీష్ కళ్యాణ్ రైజా విల్సన్జంటగా నటించిన ‘ప్యార్ ప్రేమ కాదల్’ సినిమాకు రీమేక్. జీఏ2 పిక్చర్స్ అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. నవంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ కానుండటంతో మేకర్స్ ప్రయోషన్లు ప్రారంభించారు.

అయితే టీజర్‌లో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. హాట్ రొమాంటిక్ సీన్స్ తో లిప్‌లాక్ సన్నివేశాలు యూత్‌ని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ రొమాంటిక్ సినిమా పూర్తిగా యూత్‌ని టార్గెట్ చేస్తూ టీజర్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఆదివారం జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం చిలిపి, అల్లరి, గొడవలతో ఉంటుందని, మోతాదుకు మించిన రొమాంటిక్ సీన్స్ ఉంటాయని సమాచారం. అలాగే సెకండాఫ్‌లో మొత్తం ఎమోషన్ సీన్స్ ఉంటాయట.

కాగా, టీజర్‌లో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ లిప్‌లాక్ సీన్లతో రెచ్చిపోయారు. ఈ సీన్లను చూసి ప్రేక్షకులు షాక్‌కు గురవుతున్నారు. అయితే చాలా సినిమాల్లో ఒకటి, రెండు మహా అంటే మూడు లిప్‌లాక్ సీన్లు మాత్రమే ఉంటాయి. కానీ ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాలో పదహారు లిప్‌లాక్ సీన్లు ఉన్నాయట. అయితే ఈ సినిమా ఎలా ఉంటుందో.. ఎంత రొమాంటింగ్‌గా ఉంటుందో మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే..

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -