Tollywood: రాజకీయాలలోకి వచ్చి పార్టీలు స్థాపించిన స్టార్ సెలబ్రిటీలు వీళ్లే?

Tollywood: మనదేశంలో రాజకీయాలకు సినిమా రంగానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా హీరోయిన్లుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎంతోమంది సినీ తారలు అనంతరం రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో కూడా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు ఉన్నారు.అయితే కొంతమంది మాత్రం రాజకీయాలలోకి వచ్చి ఏకంగా పార్టీలను స్థాపించి రాజకీయాలలో తమదైన ముద్ర వేసుకున్నారు.మరి రాజకీయాలలోకి వచ్చి పార్టీలను స్థాపించిన సెలబ్రిటీలు ఎవరు, వారు స్థాపించిన పార్టీలు ఏంటి అనే విషయానికి వస్తే..

నందమూరి తారకరామారావు: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు రాజకీయాలలోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే ఈయన ముఖ్యమంత్రి కావడం విశేషం.

ఎంజీ రామచంద్రన్: తెలుగులో ఎన్టీఆర్ ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకున్నారో తమిళంలో ఎంజిఆర్ అదే క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎంజీ రామచంద్రన్ రాజకీయాలలోకి వచ్చి అన్నా డీఎంకే పార్టీని స్థాపించారు.

కమల్ హాసన్: కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమల్ హాసన్ రాజకీయాలపై ఆసక్తితో రాజకీయాలలోకి వచ్చి మక్కల్ నీది మైయం రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికలలో పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు. అయినా ఈయన రాజకీయాలలోనే కొనసాగుతున్నారు.

విజయ్ కాంత్: కోలీవుడ్ నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయ్ కాంత్ కూడా రాజకీయాలపై ఆసక్తితో రాజకీయాలలోకి వచ్చారు. ఈయన 2005లో దేశీయ ముర్పేక్కు ద్రవిడ కజగం పార్టీని స్థాపించారు .

చిరంజీవి: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి తారకరామారావు తర్వాత తరంలో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు చిరంజీవి.ఈయన కూడా సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనంతరం రాజకీయాలలోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అయితే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారు.

పవన్ కళ్యాణ్: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అందరికీ సుపరిచితమే ఈయన కూడా హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందారు ఇక ఈయన జనసేన పార్టీని స్థాపించి 2019 ఎన్నికలలో పోటీ చేశారు.ఎన్నికలలో ఘోర పరాజయం పాలయ్యారు అయితే ఈసారి ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు.

హరికృష్ణ: సినీ నటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన తన తండ్రి బాటలోనే రాజకీయాలలోకి కూడా వచ్చారు. తెలుగుదేశం పార్టీలో ఎంపీగా కొనసాగిన హరికృష్ణ అనంతరం అన్న టిడిపి పార్టీని స్థాపించారు.ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లలేక తిరిగి టిడిపిలోనే కొనసాగారు.

విజయశాంతి: నటిగా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయశాంతి హీరో రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అయితే ఈమె కూడా రాజకీయాలపై ఆసక్తితో రాజకీయాలలోకి వచ్చి
తల్లి తెలంగాణ రాజకీయ పార్టీని స్థాపించార. అనంతరం తెరాసలో అడుగుపెట్టి, కాంగ్రెస్, బిజెపిలో జాయిన్ అయ్యారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -