Lokesh: ఆ గాడిదలనే అడగండంటూ లోకేశ్ కామెంట్స్.. సీఎం పరువు పోయిందిగా!

Lokesh: సిద్దం అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశాఖ వేదికగా ఎన్నికల శంఖారావం పూరించారు. ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంతోనే ఆ పార్టీ సోషల్ మీడియా తప్పుడు వార్తలను వైరల్ చేయడం స్టార్ట్ చేసింది. అలాంటి వార్తలతో ఏ విధంగా లాభం పొందాలి అనుకుంటారో తెలియదు కానీ, మరింత చలకన అయిపోవడం ఖాయం.

 

అమెరికాలో నారాలోకేష్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి అక్కడే జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారని వైరల్ అయింది. అసలు ఈ వార్తలో నిజం ఎంత? ఈ వార్తను మొదలు పెట్టింది ఎవరు అని చూస్తే వైసీపీ సోషల్ మీడియాలోనే మొదలైందని తెలిసింది. ఈ వార్తను ప్రజల్లోకి తీసుకెళ్లేలా వైసీపీ ఎన్నారై టీం కూడా తన వంత కృషి చేశారు. అయితే, ఆదిలోనే అంతం అన్నట్టు.. ఈ వార్త మొదలైన కొన్ని గంటల్లోనే అందరి నోర్లు మూతపడేలా సమాధానం చెప్పారు నారా లోకేష్. అంతేకాదు, దానికి తగ్గట్టుగేనా టీడీపీ సోషల్ మీడియాలో కూడా గట్టి కౌంటర్లు ఇచ్చారు. రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకున్న నారాలోకేష్ ఫోటోలను టీడీపీ శ్రేణులు షేర్ చేశారు. ఆ ఫోటోల్లో లోకేష్ సెక్యూరిటీ కూడా ఉంది. లోకేష్ ను అరెస్ట్ చేయడానికి ఆంధ్రపోలీసులు వెళ్లారా? ఆంధ్ర పోలిసులు అరెస్ట్ చేసి అమెరికా జైళ్లో పెట్టారా? అయినా అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి మన దేశానికి అప్పగించాలి కదా? ఇక్కడేంటీ సీన్ రివర్స్ అయింది అని టీడీపీ సోషల్ మీడియాలో వైసీపీకి కౌంటర్లు వేశారు.

నారాలోకేష్ కూడా ఇదే విషయంపై స్పందించారు. హైద్రాబాద్ నుంచి విజయవాడ వస్తున్న లోకేష్ ను గన్నవరం ఎయిర్ పోర్టులో మీడియా పలు ప్రశ్నలు సంధించింది. మీరు అమెరికాలో అరెస్ట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. మీ స్పందన ఏంటీ అని అడిగితే? అరెస్ట్ చేసింది ఎవరిని? జగన్ రెడ్డినా? ఆయన కుమార్తెనా? లేకపోతే భారతీ రెడ్డినా? అని ప్రశ్ననే సమాధానంగా చెప్పారు. మీపై ఎందుకు ఇలాంటి వార్తలు వస్తున్నాయి అని అడిగితే.. ఆ ఫోస్టు పెట్టిన గాడిదని అడగండి.. నన్నడితే నేనేం చెబుతా.. అంటూ లోకేష్ ఘాటుగా బదులిచ్చారు. దీంతో.. టీడీపీ సోషల్ మీడియాలో వైసీపీ సెటైర్లు పడుతున్నాయి. చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా.. అంటూ అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్‌ను ట్యాగ్ చేస్తున్నారు.

 

అయినా అమెరికాలో లోకేష్ అరెస్ట్ అయ్యాడని తప్పుడు ప్రచారం చేస్తే.. అందులో నిజం బయటకు రాకుండా ఉండిపోతుందా? ఎప్పుడుకైనా తెలుస్తోంది కాదా. అవినీతి ఆరోపణలులా నాన్ స్టాప్ డిస్కషన్ జరుగదు కదా? కొన్ని గంటల్లోనే నిజం తెలుస్తోంది. అనవసరంగా ఇలాంటి ప్రచారం చేసిన వాళ్లు అబాషుపాలు అవ్వడం తప్ప ఉపయోగం ఏం ఉండదు. ఇన్ని విషయాలు తెలిసి కూడా ఎందుకు ఇలాంటి ప్రచారాలను తెర తీస్తారో తెలియదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -