Lokesh: టీడీపీ పొలిటికల్ లెక్కలు మార్చేస్తున్న లోకేశ్.. మామూలోడు కాదంటూ?

Lokesh: చంద్రబాబు తర్వాత టీడీపీ నాయకుడు ఎవరు? పార్టీని ఎవరు నడిపిస్తారు? ఇక టీడీపీ పని అయిపోయిందా? ఈ ప్రశ్నలు 2019 నుంచి బలంగా వినిపించాయి. చంద్రబాబుతోనే టీడీపీ దుకాణం బంద్ అని వైసీపీ ప్రచారం చేస్తే.. దాన్ని టీడీపీ నేతలు కూడా బలంగా తిప్పి కొట్టలేకపోయారు. దానికి కారణం నారాలోకేష్ నాయకత్వ లక్షణాలపై అనుమానం. అయితే, ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు టైం మారింది. పార్టీకే కాదు. ఏపీ రాజకీయాల్లో లోకేష్ ఓ ఆశాకిరణంలా మారాడు. చంద్రబాబు తర్వాత ఏపీలో ఆ స్థాయి విజనరీ ఉన్న నేత లేరని అంతా అనుకున్నా.. లోకేష్ మాత్రం అంతకు మించి అనిపించుకుంటున్నారు. నిజానికి లోకేష్ ఇంటిలిజెన్సీపై పార్టీ నేతలకు నమ్మకం ఉన్నా.. ప్రజల నాయకుడు అనిపించుకుంటాడా? అనే అనుమానం ఉండేది. ఆ అనుమానాలను కూడా నారాలోకేష్ పటాపంచలు చేశారు.

పార్టీలో విప్లవాత్మకమైన మార్పులకు లోకేష్ శ్రీకారం చుట్టారు. పార్టీ సభ్యత్వం తీసుకుంటే వారికి ఇన్సూరెన్స్ కల్పించిన మొదటి పార్టీ టీడీపీ. ఇదే ఏపీలోనే కాదు దేశ రాజకీయాల్లో ఈ ఒరవడికి పునాదులు వేసింది టీడీపీ. ఇప్పుడు ఇదేబాటలో అన్ని పార్టీలు నడుస్తున్నాయి. అయితే, ఈ ఆలోచన నారాలోకేష్‌దే. అంతేకాదు, నగదు బదిలీ అనే ఆలోచన కూడా నారాలోకేష్‌దే. 2009 ఎన్నికల్లో టీడీపీ మ్యానిఫెస్టో‌లో ఈ హామీ ఇచ్చింది. ఆ ఎన్నికల ఫలితాల్లో నగదు బదిలీ హామీ ప్రభావం కనిపించింది. 2004 కంటే 2009లో టీడీపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. అయితే.. ప్రజారాజ్యం, లోక్‌సత్తా పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడంతో టీడీపీ అధికారానికి దూరమైపోయింది. ఇలా చాలా విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు లోకేష్. పార్టీలో ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చినా.. అవి పార్టీకే పరిమితం అయ్యాయి. ప్రజల్లోకి వెళ్లలేదు. అంతేకాదు, రాజకీయాల్లో నిలబడాలంటే తెలివితేటలతో పాటు మాస్ ఫాలోయింగ్ ఉండాలి. ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు, బూతులు మాట్లాడేవారు రాణిస్తున్నారు. అయితే, లోకేష్ మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. అందుకే ఆయనకు పప్పు అని ముద్రవేసింది వైసీపీ. అంతటితో ఆగలేదు.. ఆయన శరీర ఆకృతిపైనా సోషల్ మీడియాలో దారుణంగా ప్రచారం చేశారు.

 

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిపై కొన్ని అంచనాలు ఉంటాయి. కానీ, మొదట్లో ఆ అంచనాలను అందుకోవడంలో లోకేష్ విఫలమయ్యారు. ప్రజానేతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో, ఆయనపై విమర్శలు, సెటైర్లు, పంచుల ఇంకా తీవ్రమయ్యాయి. కానీ, ఆయన వాటికి చలించలేదు. అలాగని వ్యక్తిగత దూషణలకు పోలేదు. కానీ.. సమాధానం ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. ప్రజల్లో తిరిగారు. ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రతిపక్షాలపై సినిమా రేంజ్ పంచులు, సెటైర్లతో ప్రజలను ఆకట్టుకున్నారు. కానీ, మళ్లీ వ్యక్తిగత దూషణల జోలికి వెళ్లలేదు. విలువలు పాటిస్తూనే రాజకీయం చేయాలనే విషయాన్ని ఆయన మర్చిపోలేదు. నిజానికి 2019 ఎన్నికల్లో గెలిచే స్థానం నుంచి పోటీ చేసిన ఆయన అసెంబ్లీకి వెళ్లొచ్చు. కానీ, టీడీపీ ఎప్పుడూ గెలవని మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పడిలేచిన కెరటంలా కోల్పోయిన దగ్గరే నిదొక్కుకోవాలని మంగళగిరిలో సొంత నిధులతో కొన్ని పథకాలను అమలు చేస్తున్నారు. దీని ప్రభావం అక్కడ కనిపిస్తోంది. అందుకే, సిట్టింగ్ ఎమ్మెల్యేకు కాకుండా వైసీపీ కొత్త అభ్యర్థిని మంగళగిరిలో తెరపైకి తీసుకొచ్చింది. అంటే, ఎన్నికలు రాకముందే వైసీపీ లోకేష్ గెలుపుని ఒప్పుకుంది.

 

లోకేష్ పాదయాత్ర ద్వారా జనాల్లోకి వెళ్లారు. ఈ పాదయాత్రపై కూడా చాలా సెటైర్లు పడ్డాయి. కానీ, తనదైన శైలిలో లోకేష్ పాదయాత్రను కొనసాగించారు. ప్రతీ నియోజవర్గంలో స్థానిక సమస్యలపై గళం విప్పారు. విద్యార్థులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులు, వృద్దులతో మీటింగులు నిర్వహించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. లోకేష్ కి పెరుతున్న ఆదరణను చూసి వైసీపీ ఎక్కడిక్కడ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేసింది. యాత్రపై, లోకేష్ పై వ్యక్తిగత దూషణలు చేశారు. లోకేష్ కూడా అదే రేంజ్‌లో పాలసీలపై కౌంటర్ చేసేవారు. మధ్యలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. లోకేష్ పారిపోయాడు… ఢిల్లీలో దాక్కున్నాడని వైసీపీ పని కట్టుకొని ప్రచారం చేసింది. కానీ ఆయన మాత్రం చంద్రబాబును జైలు నుంచి విడిపించి వైసీపీకి సమాధానం చెప్పారు. అప్పటి వరకూ లోకేష్ గొప్పనాయకుడు అని టీడీపీ నేతలు మాత్రమే నమ్మారు. కానీ, చంద్రబాబుని జైలు నుంచి విడిపించిన తర్వాతే లోకేష్.. బాబుకి మించిన వాడు అని అధికార వైసీపీ, ప్రజలు కూడా నమ్మారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -