Ramakrishna Reddy: మస్తు షేడ్స్ ఉన్నాయ్ మంగళగిరి ఆర్కే.. అప్పుడో మాట ఇప్పుడో మాట అంటూ?

Ramakrishna Reddy: నారాలోకేష్ మంగళగిరి ఎమ్మెల్యేను కరకట్ట కమల్ హాసన్ అని పిలుస్తారు. అది ఎందుకో లోకేష్ చేసిన ట్వీట్ ను చూస్తే అర్థం అయిపోతుంది. వైసీపీ నుంచి బయటకు వెళ్లే ముందు జగన్ పైన, ఏపీ ప్రభుత్వంపైన పలు విమర్శలు చేశారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిని జగన్ గాలికొదిలేశారని అన్నారు. అలా మాట్లాడిన ఆర్కే కాంగ్రెస్ లో చేరి ఆ తర్వాత రెండు నెలల్లోనే వైసీపీ గూటికి చేరిపోయారు. అయితే, ఆర్కే జగన్ కు వ్యతిరేకంగా చేసిన కామెంట్స్ ను లోకేష్ ట్వీట్ చేశారు.

సీఎం జగన్ మంగళగిరికి ఇచ్చిన మాటను తప్పారని ఆ వీడియోలో చెప్పారు. అంతేకాదు… నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,200 కోట్ల నిధులు విడుదల చేస్తామని ఆయన మాటిచ్చారని గుర్తు చేశారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని.. అందుకే రూ. 500 కోట్లు కేటాయిస్తామన్నారని అన్నారు. ఆ రూ. 500 కోట్లు తర్వాత రూ. 350కు మార్చి.. చివరికి రూ. 125 కోట్లు పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. ఆర్కే కామెంట్స్‌లో క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటీ అంటే.. చివరికి రిలీజ్ చేసిన నిధులు మాత్రం శూన్యం అని అన్నారు. అంతటితో ఆగకుండా అధికారంలో ఉండి కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా వారికి ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో రేపు ఓట్ల కోసం ఎలా తిరుగుతామని ప్రశ్నించారు. పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు, నవులూరు గ్రామాల్లో తిరిగడానికి మనసు రావడం లేదని అన్నారు. సంక్షేమం ఒక్కటి చేస్తే సరిపోతుందా? అభివృద్ధి చేయాల్సిన పని లేదా?అని ప్రశ్నించారు. లోకేష్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గామారింది.

మొదట జగన్ దేవుడు, రాముడు అని చెప్పిన ఆర్కే.. తర్వాత ఇలా ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండోసారి వైసీపీ గూటికి చేరిన తర్వాత మంగళగిరిలో అభివృద్ధి అద్భుతంగా జరిగిందని ప్లేట్ ఫిరాయించారు. అందుకే లోకేష్ ఆయన్ని కరకట్ట కమల్ హసన్ అంటారు. కానీ, కరకట్ట కమల్ హాసన్ కాదు. అపరిచితుడు అంటే సరిపోతుంది. ఎందుకంటే అపరిచితుడు సినిమాలో విక్రమ్ ఒకే సీన్ లో రెండు షేడ్స్ చూపిస్తారు. అందుకే ఆర్కేకు కూడా అపరిచితుడు పేరు సరిపోతుందని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

మొత్తానికి మంగళగిరి ప్రజలు అటు జగన్ చేతిలో ఇటు ఆర్కే చేతిలో మోసపోయారు. జగన్ గత ఎన్నికల్లో ప్రచారం చేసి ఆర్కేను గెలిపిస్తే.. మంత్రిని చేస్తానని అన్నారు. మంత్రి ఉంటే నియోజకవర్గం అభివృద్ది చెందుతుందని భావించి స్థానికులు ఆర్కేను గెలిపించారు. కానీ, చివరికి జగన్ ఆర్కేను మంత్రిని చేయలేదు. మంగళగిరిని అభివృద్ది చేయలేదు. అంతో ఇంతో మంగళగిరిలో సర్వీస్ కనిపిస్తుందంటే.. అది నారాలోకేష్ సొంతనిధులతో చేసిన సంక్షేమే. మంత్రిపదవి కోసం జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికి ఆర్కే చంద్రబాబుపై ఓ కేసు కూడా వేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుపై కేసు నమోదు చేయడానికి ప్రధాన కారణం ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదునే. ఇన్ని చేసినా జగన్ మాత్రం ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో.. ఆయన కోపంతో వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. అయితే, రెండు నెలలు తిరిగే సరికి మళ్లీ ఆయన సొంతగూటకి చేరిపోయారు. ఇంతలో ఆయనలో ఎందుకు మార్పు వచ్చిందతో తెలియదు కానీ.. షర్మిల అప్పట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్కేపై చాలా ఒత్తిడి ఉందని అన్నారు. దీంతో.. షర్మిల ఆర్కే అభిమానులలో ఓ ఆలోచనను కలిగించారు. ఆ ఒత్తిడితోనే ఆయన మళ్లీ వైసీపీలో చేరారని చెప్పారు. రీజన్ ఏదైనా కావచ్చు కానీ.. గతంలో నియోజవర్గంలో అభివృద్ది జరగలేదని చెప్పిన ఆర్కే.. తర్వాత అభివృద్ధి అద్భుతం అని చెప్పడం పైనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -