Nara Lokesh: బాల‌య్య కూతురిని తొలిచూపులోనే ల‌వ్ చేశా.. నారా లోకేశ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Nara Lokesh: టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి తన మేనత్త కుమారుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు అయినా నారా లోకేష్ ను 2007లో పెళ్ళాడిన సంగతి తెలిసిందే. బ్రాహ్మణి పబ్లిసిటీని పెద్దగా ఇష్టపడరు. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అంతేకాకుండా సోషల్ మీడియాకు కూడా ఆమె చాలా వరకు దూరంగా ఉంటారు. అటు అమ్మగా, గృహిణిగా, వ్యాపారవేత్తగా వేరువేరు రంగాలలో సత్తా చాటుతున్న ఆమె ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ప్రస్తుతం నారా లోకేష్ ఏపీలో యువ‌గళం పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఏపీలోని పలు జిల్లాలను సందర్శిస్తూ ప్రజల బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ యువతతో మీట్ అవుతూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు లోకేష్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. బ్రాహ్మణి గారితో పెళ్లి ప్రతిపాదన మొదట ఎవరు ? తీసుకొచ్చారు అని ఆ విద్యార్థిని ప్రశ్నించింది. దీంతో ఒక్కసారిగా ఎగ్జిట్ అయిన లోకేష్ నాది బ్రాహ్మణిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మామయ్య భయంతో భయపెట్టలేకపోయాను. ఆ తర్వాత అమ్మానాన్న చర్చలు జరిపిన తర్వాత నా అభిప్రాయం అడిగారు.

 

మొత్తంగా బ్రాహ్మణి, నేను తొలిచూపులోనే ప్రేమించుకున్నాము. బ్రాహ్మణి పెళ్లి ప్రతిపాదన అంగీకరించడంతో మిగిలినది చరిత్రగా మారింది అంటూ లోకేష్ సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఆ వీడియో పై మెగా అభిమానులు టిడిపి నేతలు స్పందిస్తూ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -