Chiranjeevi: చిరంజీవి ముందు నా పైట విప్పాలి అన్నారు.. కానీ రిజెక్ట్ చేశాను: మాధవి రెడ్డి

Chiranjeevi: తెలుగు ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి పేరు పరిచయం అక్కరలేనిది. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి నటుడుగా తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడి ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ప్రస్తుతం చిరంజీవి అనే మహా వృక్షం నీడలో చాలామంది మెగా హీరోలు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు.

ప్రస్తుతం వీళ్లు కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. ఇక చిరంజీవి రాజకీయంలో కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కుర్ర హీరోలతో సమానంగా చిరు సినిమా అవకాశాలను అందుకుంటూ ఇప్పటి ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటున్నాడు. ఇక చిరు సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ తన సినిమాల గురించి సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు.

ఇదిలా ఉంటే తాజాగా ఒక నటి చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు బయట పెట్టింది. నటి మాధవి రెడ్డి గురించి మనందరికీ తెలిసిందే. ఈమె పలు సినిమాల్లో తల్లి పాత్రలు చేస్తూ నటిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఫిలిం ట్రీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. చిరంజీవి సినిమాలో తనకు ఒక ఆఫర్ వచ్చిందని.. అదేమిటంటే చిరంజీవి ముందు తను పైట జారేసుకోవాలని.. అది తన పాత్ర అని తెలిపింది.

కానీ తాను దానికి ఒప్పుకోలేదట. తమది చాలా పెద్ద కుటుంబమని.. కాబట్టి తాను రెస్పెక్టబుల్ గా ఉండాలని.. అందుకే ఆ క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడలేదని మాధవి రెడ్డి తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్లో వైరల్ గా మారింది. ఇక చిరంజీవి రాబోయే సినిమా విషయానికొస్తే గాడ్ ఫాదర్. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియోని విడుదల చేశారు. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా గురించి భారీ అంచనాలు మొదలయ్యాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -