Madhya Pradesh: వృద్ధురాలిపై అలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టిన దుర్మార్గుడు?

Madhya Pradesh: సమాజంలో రోజురోజుకీ ఆడవారికి రక్షణ కరువవుతోంది. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ఏ ఒక్కరికి మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. కామాందులు వావివరసలు చిన్న పెద్ద మరిచి ఆడవారిపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఆడవారు ఒంటరిగా కనిపిస్తే చాలు మృగాలుగా మారి వారిపై అత్యాచారాలకు హత్యలకు పాల్పడుతున్నారు. దీంతో స్త్రీలు ఇంటీ నుంచి బయటకు రావాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇంకా చెప్పాలి అంటే కామాంధులు పాలు తాగి పసిపిల్లలను సైతం వదలడం లేదు. ఎవరిని వదిలిపెట్టకుండా వారి కామ కోరికలను తీర్చుకుంటున్నారు.

తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒక వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక కామాంధుడు. ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం షాహ్ డోల్ జిల్లాలోని ఆంత్రా అనే గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు జబల్ పూర్ నుంచి 90 ఏళ్ల వృద్ధురాలు షాహ్ డోల్ రైల్వేస్టేషన్ దిగింది. ఆమె బంధువుల గ్రామమైన ఆంత్రా జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరం ఉంది. ఆమె షాహ్ డోల్ రైల్వేస్టేషన్ కి చేరుకునే సమయానికి అర్ధరాత్రి కావడంతో స్టేషన్ లోనే ఉండిపోయారు. ఇక మరుసటి రోజు ఉదయం రైల్వే స్టేషన్ నుంచి బయటకి వచ్చిన ఆ మహిళ ఆటో ఎక్కి బంధువుల గ్రామానికి బయలుదేరింది.

ఆటోడ్రైవర్ గ్రామానికి సమీపంలో ఉన్న మెయిన్ రోడ్డుపైనే ఆమెను దించేసి వెళ్లాడు. అక్కడి నుంచి వెళ్లేందుకు ఆమె బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇదే సమయంలో అటుగా ఓ వ్యక్తి బైక్ పై వచ్చి లిఫ్ట్ ఇస్తానని ఆమెను నమ్మించగా అతని మాయమాటలు నమ్మిన ఆ వృద్ధురాలు అతని బైక్ ఎక్కింది. ఆ తర్వాత అతడు ఆ వృద్ధురాలిని నిర్మానుష ప్రాంతంలోకి తీసుకెళ్లి బైక్ ని ఆపి అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మళ్లీ ఆ వృద్ధురాలిని తీసుకొని వచ్చి ప్రధాన రహదారిపై వదిలి పారిపోయాడు. ఎట్టకేలకు బంధువుల ఇంటికి చేరుకున్న వృద్ధురాలు జరిగిన మొత్తం వివరించడంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఫిర్యాదు మనకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తము ఆసుపత్రికి తరలించి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -