Sitara Ghattamaneni: సితార‌కి న‌మ్ర‌త మంచి సంస్కారం నేర్పిందిగా.. ఆమె మంచి మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!

Sitara Ghattamaneni: సితార చేసే క్యూట్ ఆక్టివిటీస్ అన్ని మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ చిన్న వయసులోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. హీరోగా మహేష్ బాబు ఎంత పాపులర్ అయ్యాడో ఈయన కూతురు ఘట్టమనేని సితార కూడా అంతే పాపులారిటీని సంపాదించుకుంది. ఈమెకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో తన ఫ్రెండ్ ఆద్య తో కలిసి తనకి నచ్చిన అంశాలని అప్లోడ్ చేస్తూ తన అభిమానులకి చేరువగా ఉంటుంది.

అయితే ఇప్పుడు ఆమె చేసే పనుల గురించి కాకుండా ఆమె మంచి మనసు గురించి కూడా మనమందరం మాట్లాడుకునేలా చేసింది సితార. ఇంతకీ ఏం జరిగిందంటే ఒక అంతర్జాతీయ వ్యాపార సంస్థ హైదరాబాదులో అతిపెద్ద బొమ్మల కొలువు పెట్టింది. దీన్ని సితార ప్రారంభించింది. ఈ సందర్భంగా పిల్లలకు, వృద్ధులకు దసరా కానుకలని అందజేశారు. అయితే అక్కడ కొందరు వృద్ధులు ఆ మెట్లు ఎక్కలేని పరిస్థితిలో ఉంటే సితార స్వయంగా వారిని చేత్తో పట్టుకుని ఎక్కించింది.

ఇది చూసిన చూసిన వారు సితారది ఎంత గొప్ప మనసు అంటూ ఆమె మంచి మనసుకి ఫిదా అయిపోయారు. ఇదంతా తల్లి నేర్పిన సంస్కారం అంటూ ఆమెను మెచ్చుకున్నారు. మరో సందర్భంలో కూడా ఈమె తన మంచి మనసుని చాటుకున్నారు. అదేమిటంటే అతి చిన్న వయసులోనే జువెలరీ యాడ్ చేసిన సితార తనకి వచ్చిన ఫస్ట్ రెమ్యూనరేషన్ ని చారిటీకి ఇచ్చి తండ్రికి తగ్గ తనయురాలు అయింది.

ఎందుకంటే మహేష్ బాబు కూడా ఎన్నో లక్షలు ఖర్చుపెట్టి ఎంతో మందికి గుండె ఆపరేషన్లు చేయిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అలాంటి ఉత్తమమైన తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన సితార భవిష్యత్తులో మరింత మరిన్ని మంచి పనులు చేస్తుందని ఆశిద్దాం. అలాగే తన తల్లి నుంచి ఆత్మవిశ్వాసం నేర్చుకున్నానని, తనకి సినిమాలలో నటించే ఉద్దేశం ఉన్నట్లు చెప్పుకొచ్చింది సితార. మరెందుకు ఆలస్యం,ఆమెకి ఆల్ ద బెస్ట్ చెబుదాం.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -