Sitara: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మహేష్ బాబు కూతురు.. ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించనున్నారా?

Sitara: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు ప్రస్తుతం ఒక వైపు సినిమాలలో నటిస్తున్న మరొకవైపులా తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మహేశ్ కూడా సినిమాను త్వరగా విడుదల చేయాలని చూస్తున్నాడు. ఇలాంటి క్రమంలోనే ఆయన తన కూతురు సితారను కూడా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురాబోతున్నాడన్న వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే అందుకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపించాయి. అయితే ఈసారి మాత్రం ఒక మూవీని కన్ఫామ్ చేస్తూ ఒక పెద్ద ప్రాజెక్ట్ ద్వారా సితార తెలుగు ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇవ్వబోతుంది అన్న వార్త వైరల్ అవుతోంది. అది కూడా తన తండ్రి మహేశ్ నటిస్తున్న సినిమాతో కావడం విశేషం.

త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న జక్కన్న రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో ఒక కీలక పాత్రలో అది చిన్నప్పటి క్యారెక్టర్ లో సితార కనిపించబోతుందట. ఇప్పటికే అందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ప్రక్రియ పూర్తి అయిందట. త్వరలోనే దీనిపై మహేష్ బాబు అండ్ రాజమౌళి అధికారికంగా ప్రకటించబోతున్నారట. దీంతో మహేష్ బాబు తన కూతురు విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడని సితార ఎలాగైనా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాజ్యం ఏలడం ఖాయం అంటున్నారు మహేశ్ ఫ్యాన్స్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -