Mahesh Babu: ఆలస్యం అవుతున్న మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా విడుదలై సుమారు ఏడాది పూర్తి అయినప్పటికీ మహేష్ బాబు తదుపరిచిన మాత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. మహేష్ బాబు తన తదుపరి సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇలా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలియగానే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.

 

వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకే వచ్చిన అతడు ఖలేజా వంటి సినిమాల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా త్వరగా షూటింగ్ పూర్తి చేసుకోవాలని భావించిన ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతూనే ఉంది.మహేష్ బాబు కుటుంబంలో వరుసగా మరణాలు చోటు చేసుకోవడంతో ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతూ వస్తుంది.

ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13వ తేదీవిడుదల చేయాలని భావించారు కానీ ఈ సినిమా షూటింగ్ చూస్తే మాత్రం చాలా నత్తనడకన సాగుతున్న నేపథ్యంలో ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదల అవ్వడం కష్టమైన పని అని పలువురు భావిస్తున్నారు. ఇక మహేష్ బాబు వెకేషన్ అంటూ తన ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లడంతో ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల వాయిదా పడింది అలాగే ఈనెల 7వ తేదీని ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ జరగాల్సి ఉండగా అధికాస్తా12వ తేదీకి వాయిదా పడింది. అది కూడా తిరిగి 20 వ తేదీకి వాయిదా పడగా ప్రస్తుతం వచ్చే నెలలో ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తుంది.

 

ఈ సినిమా షూటింగ్ కు ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయో తెలియదు కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం చాలా ఆలస్యం అవుతుంది. ఇలా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా విడుదల చేసిన గ్లింప్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -